నందు, దివ్య జంటగా, గోవింద్ వరహ దర్శకత్వంలో... బాల, ప్రకాష్ కలిసి నిర్మించిన చిత్రం ‘నేను నాన్న అబద్ధం’. ఇటీవలే
విడుదలైన ఈ చిత్రాన్ని శనివారం హైదరాబాద్‌లో విలేకరులకు ప్రదర్శించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన
సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ-‘‘గోదావరి జిల్లాల్లో ప్రేక్షకుల మధ్య ఈ సినిమా చూశాను. ఊహించని స్పందన
చూసి విస్మయానికి లోనయ్యాను. ఇప్పటికీ బ్లాక్‌లో టికెట్లు కొంటున్నారు. కేవలం మౌత్ టాక్ ద్వారానే ఇంతటి రెస్పాన్స్
రావడం ఆనందంగా ఉంది. మంచి సినిమాలు అరుదుగా వస్తాయి.
అలాంటి సినిమానే ఇది’’ అన్నారు. ‘‘ఓ చిన్న సినిమాకు పెద్ద స్పందన రావడం ఆనందకరం. ఈ సినిమాను
మరింతగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి వినూత్నంగా పబ్లిసిటీని ప్లాన్ చేశాను. ప్రతిరోజూ లక్కీ డ్రా ద్వారా ఓ గోల్డ్ కాయిన్‌ని
ప్రేక్షకులకు అందివ్వాలనుకుంటున్నాం. రేపటి నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది’’ అని నిర్మాతల్లో ఒకరైన బాల
చెప్పారు. ఈ సినిమా సోలో హీరోగా తనకు గుర్తింపు తెచ్చిందని, ఈ సినిమా విజయంపై నిర్మాతలు చాలా నమ్మకంతో
ఉన్నారని హీరో అన్నారు. మంచి కథతో రూపొందిన సినిమా ఇదని, దర్శకుడు గొప్పగా సినిమాను మలిచారని, తన
పాత్రకు మంచి ప్రశంసలు అందుతున్నాయని కథానాయిక దివ్య అనందాన్ని వ్యక్తం చేశారు. ఇంకా నటుడు, నిర్మాత
ప్రకాష్ భరద్వాజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
|