Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
నారా రోహిత్ కొత్త చిత్రం
     తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ‘సింహా’ లాంటి మూవీని అందించిన ప్రతిష్టాత్మక యునైటెడ్ మూవీస్ సంస్థ తాజాగా ‘నారా రోహిత్’ హీరోగా ప్రకాష్ తోలేటిని దర్శకునిగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నారా రోహిత్ సరసన అందాల నటి హన్సిక హీరోయిన్ గా నటిస్తోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేయడంతో పాటు పలు హిట్ చిత్రాల రచనలో విశేషానుభవం గడిచిన ప్రకాష్ తోలేటిని దర్శకునిగా పరిచయం చేస్తున్నామని నిర్మాత పరుచూరి కిరీటి తెలిపారు. ‘బాణం’లాంటి విజయవంతమైన చిత్రం తర్వాత మంచి సబ్జెక్టు కోసం ఎదురు చూసిన నారా రోహిత్ మా చిత్రం కోసం ఎంతో హోమ్ వర్క్ చేస్తున్నారని నిర్మాత తెలిపారు. త్వరలో ప్రారంభమయ్యే ఈ చిత్రానికి సీనియర్ టెక్నీషియన్స్ అయిన చక్రి మ్యూజిక్, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, బి.రాజశేఖర్ కెమెరా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, ఏ.యస్.ప్రకాష్ ఆర్ట్ ఈ చిత్రానికి హైలైట్స్ గా నిలుస్తాయి.

బ్రహ్మానందం, హర్షవర్థన్, ఆహుతి ప్రసాద్, రఘుబాబు, అజయ్, రావు రమేష్, చిత్రం శ్రీను, వెన్నెల కిషోర్, విజయ్ సాయి, విష్ణు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com