యంగ్‌టైగర్ ఎన్టీఆర్ -'కిక్' సురేందర్‌రెడ్డిల కాంబినేషన్‌లో భోగవల్లి బాపినీడు సమర్పణలో ప్రముఖ నిర్మాత ఛత్రపతి ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి 'ఊసరవెల్లి' టైటిల్ కన్‌ఫర్మ్ అయింది.
ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ - ''ఎన్టీఆర్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో మా శ్రీవెంకటేశ్వర సినీచిత్రం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బేనర్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న చిత్రానికి 'ఊసరవెల్లి' టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేశాము. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పవర్‌ఫుల్ స్టోరీతో, హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పెర్‌ఫార్మెన్స్ హైలైట్‌గా వుంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.
రాబోయే చిత్రాల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ వున్న ఈ భారీ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, తమన్నా, ప్రకాష్‌రాజ్, తనికెళ్ళ భరణి, విదూత్ జామ్వాల్, ఆద్విక్ మహాజన్, పాయల్ ఘోష్, ఆలీ, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, ఎం.ఎస్.నారాయణ, దువ్వాసి మోహన్, రఘు కారుమంచిలతోపాటు ఇంకొంతమంది నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తారు.
ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫోటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, ఆర్ట్: రవీందర్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, పాటలు: చంద్రబోస్, అనంతశ్రీరామ్, రామజోగయ్యశాస్త్రి, కో-డైరెక్టర్స్: సత్యంబాబు, సురేష్ కోటా, ప్రొడక్షన్ కంట్రోలర్: సూరపనేని కిషోర్, లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సురేందర్‌రెడ్డి.