ఓంకార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై చిన్నికృష్ణ కథ, స్క్రీన్ ప్లే తో, ఓంకార్ దర్శకత్వంలో
నిర్మిస్తున్న ‘జీనియస్’ చిత్రం లోగో ఆవిష్కరణ జరిగింది. కె.విశ్వనాథ్, అల్లు అరవింద్, బి.గోపాల్,
పరుచూరి గోపాలకృష్ణ, ఆకెళ్ళ రాఘవేంద్ర, వినాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.
కె.విశ్వనాథ్ మాట్లాడుతూ - చిన్నికృష్ణ గత చిత్రాల్లా ఈ చిత్రం కూడా విజయవంతం కావాలి. ఈ
చిత్రం ప్రచారం ఆసక్తికరంగా ఉందని అన్నారు. అల్లు అరవింద్ మట్లాడుతూ - అల్లు అర్లున్ హీరో
కావడానికి ముఖ్య కారకుల్లో చిన్నికృష్ణ ఒకరు. ఇన్నేళ్ళలో అతి తక్కువ చిత్రాలకు రాసాడంటే -
అతను ఒక్కో చిత్రానికి ఎంత కష్టపడి రాస్తాడో అర్థమవుతుంది. ఓంకార్ వంటి క్రియేటివ్ పర్సన్ ని
భావ దారిద్ర్యం ఉన్న మన చిత్ర పరిశ్రమలోకి ఆహ్వానిస్తున్నాను - అని అన్నారు.
చిన్నికృష్ణ మాట్లాడుతూ - స్వాతంత్ర్యం తర్వాత మన వాళ్ళు కొత్త విషయాలేవీ కనిపెట్టలేని
పరిస్థితికి కారణం చర్చిస్తూ, విద్యార్థులు ఏమి నేర్చుకోకూడదో ఇందులో చెబుతున్నాం. ఓంకార్
సోదరుడితో పాటు ఇందులో మొత్తం నలుగురు హీరోలుంటారు. టాలెంట్ హంట్ ద్వారా ఈ
చిత్రంలో నటీనటులను ఎంపిక చేస్తాం - అని అన్నారు. ఓంకార్ మాట్లాడుతూ - టాలెంట్ ఉంటే
చిత్ర రంగంలో తప్పని సరిగా ప్రోత్సాహం లభిస్తుంది. చిన్నికృష్ణ అన్నయ్య ప్రోత్సాహంతో చేస్తున్న
ఈ చిత్రం బాగా చేయడం ద్వారానే నేను జీనియస్ ని అని నిరూపించుకుంటాను - అని అన్నారు.
ఈ చిత్రానికి సమర్పణ : ఠాగూర్ మధు.