Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
సంక్రాంతికి ‘ఓం శాంతి’
     కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్న తాజా చిత్రం 'ఓం శాంతి'. నవదీప్‌, నిఖిల్‌, బిందుమాధవి, అదితిశర్మ ముఖ్య తారాగణం. మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ అనుబంధ సంస్థ ‘త్రీ ఎంజెల్స్‌ స్టూడియో’ నిర్మిస్తోంది. ప్రకాష్‌ దర్శకత్వంలో శేషు ప్రియాంక చలసాని నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న సంక్రాంతి పర్వదినాన విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -"ఐదు కథలు, ఐదు జీవితాలు, ఒక నిజం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ఇది అన్నారు.

తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఇదొక సరికొత్త ప్రయోగం. ఈ చిత్రంలో కాజల్‌, మేఘన అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తారు. ఆమె పాత్ర అందర్ని అలరిస్తుంది. నవదీప్‌, అదితిశర్మ ఓ జంటగా నటిస్తున్నారు. నిల్‌ పాత్ర చాలా వైవిధ్యంగా వుంటుంది. బిందుమాధవి ముస్లిమ్‌ అమ్మాయిగా కనిపిస్తారు. తప్పకుండా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇళయరాజా సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియోను డిసెంబర్‌ 5న విడుదల చేస్తున్నాం. గతంలో ఇళయరాజా కాంబినేషన్‌లో వైజయంతి మూవీస్‌ పతాకంపై రూపుదిద్దుకున్న అఖరిపోరాటం, జగదేకవీరుడు అతిలోకసుందరి, అశ్వమేధం చిత్రాలు సంగీతపరంగా మంచి విజయాన్ని సాధించాయి. ఆ కోవలోనే ఈ చిత్రం కూడా చేరుతుందనే నమ్మకముంది. ఈ చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టబోతుంది' అన్నారు. మురళీమెహన్‌, రవి కాలే, రోహిత్‌ పాఠక్‌, రఘుబాబు, సునీల్‌, సుమన్‌శెట్టి, ప్రగతి, రణధీర్‌, శివారెడ్డి, సారిక రామచంద్రరావు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జయనన్‌ విన్సెంట్‌, మాటలు: నాగరాజు గంధం.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com