యంగ్‌టైగర్ ఎన్టీఆర్ 'కిక్' సురేందర్‌రెడ్డిల కాంబినేషన్‌లో భోగవల్లి బాపినీడు సమర్పణలో ప్రముఖ నిర్మాత ఛత్రపతి ప్రసాద్
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం
డిటిఎస్ మిక్సింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్ 6న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేసేందుకు
సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ - ''షూటింగ్ పూర్తి చేసుకున్న మా 'ఊసరవెల్లి' ప్రస్తుతం
డిటిఎస్ మిక్సింగ్ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి విజయదశమి కానుకగా అక్టోబర్ 6న వరల్డ్‌వైడ్‌గా ఈ
చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఆడియో ఇప్పటికే చాలా పెద్ద హిట్ అయింది. దేవిశ్రీప్రసాద్ చేసిన
అద్భుతమైన పాటలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. త్వరలోనే ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయబోతున్నాం. ఎన్టీఆర్ చిత్రాల్లో
వైవిధ్యమైన చిత్రంగా 'ఊసరవెల్లి' రూపొందింది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రమవుతుంది. డిఫరెంట్ రొమాంటిక్
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందన్న నమ్మకం నాకు వుంది
యంగ్ టైగర్ ఎన్టీఆర్, తమన్నా, ప్రకాష్‌రాజ్, తనికెళ్ళ భరణి, విదూత్ జామ్వాల్, ఆద్విక్ మహాజన్, పాయల్ ఘోష్, ఆలీ,
జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, ఎం.ఎస్.నారాయణ, దువ్వాసి మోహన్, రఘు కారుమంచిలతోపాటు ఇంకొంతమంది
నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తారు.
ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫోటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, ఆర్ట్:
రవీందర్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, పాటలు: చంద్రబోస్, అనంతశ్రీరామ్, రామజోగయ్యశాస్త్రి, కో-డైరెక్టర్స్:
సత్యంబాబు, సురేష్ కోటా, ప్రొడక్షన్ కంట్రోలర్: సూరపనేని కిషోర్, లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర,
సమర్పణ: భోగవల్లి బాపినీడు,నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సురేందర్‌రెడ్డి.