సొంతవూరు, గంగపుత్రులు చిత్రాలతో నంది అవార్డులు గెలుచుకున్న పి.సునీల్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం ‘ఒక రొమాంటిక్
క్రైమ్ కథ’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్ సమర్పణలో శ్రావ్య ఫిలింస్
పతాకంపై యెక్కలి రవీంద్రబాబు నిర్మిస్తున్నారు. పి.సునీల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ -‘‘టెన్త్ క్లాస్, ఇంటర్, డిగ్రీ,
చదువుతున్న ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథ ఇది. రకరకాల సామాజిక పరిస్థితులు, సాంకేతిక అభివృద్ధి
కారణంగా యువతరం మానసిక ఆందోళనలకు, ఒత్తిళ్లకు గురవుతోంది.
ప్రేమ, సెక్స్ పేరుతో విశృంఖలత మితిమీరిపోతోంది. టీనేజ్ లవ్, టీనేజ్ సెక్స్, టీనేజ్ అబార్షన్స్ రెగ్యులర్
అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇందులో వినోదాన్ని మిస్‌కావడం లేదు’’ అని
చెప్పారు. నిర్మాత యెక్కలి రవీంద్రబాబు మాట్లాడుతూ -‘‘వైజాగ్‌లో జరిగిన ముప్ఫై రోజుల సింగిల్ షెడ్యూల్‌లో
టాకీపార్ట్ పూర్తయింది. త్వరలో పాటలను చిత్రీకరిస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సాబు జేమ్స్, సంగీతం:
ప్రవీణ్ ఇమ్మడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాపిరాజు, సహనిర్మాతలు: కె.బసిరెడ్డి, కుర్రా విజయ్‌కుమార్,
కథ-స్రీన్‌ప్లే-మాటలు: దర్శకత్వం: పి.సునీల్‌కుమార్‌రెడ్డి.
|