‘అరుంధతి’గా సంచలన విజయాన్ని సాధించిన అనుష్క ప్రధాన పాత్రలో నాగార్జున పర్సనల్ మేకప్‌మ్యాన్ బొమ్మదేవర రామచంద్రరావు (చంద్ర) సాయిరత్న క్రియేషన్స్ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో నిర్మిస్తోన్న విభిన్న కథాచిత్రం 'పంచాక్షరి' రాజమండ్రి షెడ్యూల్‌తో దాదాపు పూర్తయింది. ఏప్రిల్ మొదటివారంలో ఆడియోను, చివరి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ- 'ఇది ఒక అద్భుతమైన స్క్రిప్ట్. ‘అరుంధతి’కి దీనికి ఏ విధమైన పోలికా ఉండదు. దర్శకుడు సముద్ర దీన్ని సాంకేతికంగా అద్భుతంగా మలుస్తున్నారు. ఇందులో కనిపించే ప్రతి పాత్రా చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఆద్యంతం ఆసక్తికరంగా ఈ కథ సాగుతుంది. నిర్మాతగా చంద్రకు ఇది గ్రాండ్ ఎంట్రీ అవుతుంది' అన్నారు.
దర్శకుడు సముద్ర మాట్లాడుతూ- 'అనుష్క కెరీర్‌లో మరో సెన్సేషనల్ సినిమా అవుతుంది. చంద్ర ఏ విషయంలోనూ రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందరికీ మంచి పేరు తెస్తుంది' అన్నారు.
నిర్మాత చంద్ర మాట్లాడుతూ - ‘నేను అన్నపూర్ణ సంస్థకి సదా రుణపడి వుంటాను అని అనడంకన్నా జీవితకాలం రుణపడేవుంటాను. నిర్మాతగా మంచి సినిమాని చేస్తున్నాను. ఈ చిత్రానికి అనుష్క ఎంతో సహకరిస్తున్నారు. 2010లో ‘పంచాక్షరి’ ఓ సూపర్ హిట్గా నిలబడుతుంది’ అన్నారు.
ఈ చిత్రంలో అనుష్క, సామ్రాట్, నాజర్, చంద్రమోహన్, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, అలీ, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, జీవా, బెనర్జీ, ఉత్తేజ్, నల్ల వేణు, రవిప్రకాష్, సుబ్బరాయశర్మ, సుధ, తెలంగాణ శకుంతల, సన, జయవాణి, కీర్తి, అర్చన తదితరులు నటిస్తున్నారు. కెమెరా : వాసు, కథ: మధు విప్పర్తి, మాటలు: తోట ప్రసాద్, సంగీతం: చిన్నా, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, డాన్స్: లారెన్స్, అమ్మ రాజశేఖర్, శివశంకర్, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, కళ: జి.కె.మూర్తి, పబ్లిసిటీ :కృష్ణప్రసాద్, కో-డైరెక్టర్: పిహెచ్.సుందర్, స్టిల్స్: పాండ్యన్, ఫైట్స్: సెల్వ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అక్కినేని వెంకటరత్నం, నిర్మాత: బొమ్మదేవర రామచంద్రరావు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వి.సముద్ర.