పవన్‌కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పంజా’. తమిళంలో పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విష్ణువర్థన్ ఈ చిత్రానికి
దర్శకుడు. సారాజేన్ డయాస్, అంజలి లావానియా నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కామీడియా వర్క్స్
సంయుక్త నిర్మాణంలో నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఒక పాట మినహా షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం
విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ ‘ఆద్యంతం ఆసక్తికరంగా నడిచే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. పవన్‌కళ్యాణ్ అభిమానులు ఆశించే
అన్ని అంశాలతో సినిమా చాలా స్టయిలిష్‌గా వుంటుంది.
పవన్‌కల్యాణ్ ఆహార్యం, అభినయం అన్నీ పూర్తి వైవిధ్యంగా వుంటాయి. ఈ చిత్రంలో ఆయన సరికొత్త లుక్‌తో కనిపిస్తారు. ఇప్పటి
వరకూ వచ్చిన పవన్‌కళ్యాణ్ సినిమాలకు పూర్తి భిన్నంగా వుంటుంది. నిర్మాణానంతర కార్యక్షికమాలు శరవేగంతో జరుగుతున్నాయి.
నవంబరు 13న ఆడియోను విడుదల చేయబోతున్నాం. యువన్‌శంకర్ రాజా అందించిన సంగీతం ఎక్స్‌వూటార్డీనరీగా వుంటుంది.
డిసెంబరు 9న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అన్నారు. అడవి శేష్, జాకీవూషాఫ్, అతుల్ కులకర్ణి, బ్రహ్మానందం, అలీ, సుబ్బరాజు
ఝాన్సీ, తనికెళ్ల భరణి, పరుచూరి వెంకటేశ్వరరావు, సంపత్, కిషోర్ తదితరులు ముఖ్యపావూతల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:
పి.ఎస్.వినోద్, ఎడిటింగ్: శ్రీకర్‌వూపసాద్, స్కీన్‌ప్లే: రాహుల్ కోడా, సంభాషణలు: అబ్బూరి రవి.
|