Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
‘పప్పు’ మంచి సినిమా తీసిన తృప్తినిచ్చింది!
- నల్లా ప్రవీణ్ రెడ్డి, నగేష్ యాద
      ఆస్ట్రేలియా నుండి వచ్చినపుడల్లా కథలు వినేవాడిని. సపన్ చెప్పిన కథ విని బాగుందనిపించి సినిమా ప్రారంభించాం - అని చెప్పారు. ‘పప్పు’ నిర్మాతలలో ఒకరైన ప్రవీణ్ రెడ్డి.

ముప్పై ఏళ్ళ కింద మా నాన్నగారు ప్రతాప్ రెడ్డి కె.ఆర్.విజయ, ఈశ్వరరావుతో ‘కథ మారింది’ అనే సినిమా తీసారు. నేను ఎం.ఐ.టి చదువు కోసం ఆస్ట్రేలియా వెళ్ళి 12 ఏళ్ళుగా అక్కడే ఇండియన్ రెస్టారెంట్స్, పెట్రో స్టేషన్స్ నిర్వహిస్తున్నాను. టేబుల్ టెన్నిస్ ఆట ద్వారా నాకు నగేష్ యాద మిత్రుడిగా మారారు. ఇద్దరం కలిసి చిత్ర నిర్మాణం చేయాలనుకుని సపన్ కథను ఎన్నుకున్నాం. వినోదాత్మకంగా ఉండే ఈ చిత్రంలో కృష్ణుడు పాత్రలో అన్ని రసాలు ఉంటాయి. సి.ఐ.డి అధికారిగా సుబ్బరాజు ఇందులో వెరైటీ పాత్ర పోషించారు. రెహమాన్ స్టూడెంట్ ఫణి కళ్యాణ్ మంచి పాటలు ఇచ్చారు. వాటికి అమ్మరాజశేఖర్ నృత్యదర్శకత్వం వహించారు. రామ్ లక్ష్మణ్ ఫైట్ సమకూర్చారు. రాజేంద్ర చక్కటి ఫోటోగ్రఫీ అందించారు. రామోజీ ఫిలింసిటీ, వైజాగ్, అరకు, చేవెళ్ళ, దోలారి ధని, వికారాబాద్ ఫారెస్ట్ లో పాటలు చిత్రీకరించాం. స్ర్కిప్టు ప్రకారం, మంచి సాంకేతిక విలువలతో, అనుకున్న బడ్జెట్ లో సపన్ ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఇచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి సినిమా చేసిన తృప్తి కలిగింది. ఈ నెలలోనే విడుదల చేయాలనుకుంటున్నాం. మంచి బిజినెస్ ఎంక్వయిరీలు కూడా వస్తున్నాయి - అని చెప్పారు ప్రవీణ్.

‘పప్పు’ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు
ప్రేక్షకులు ఎంటర్ టైనర్స్ నే ఎక్కువగా ఇష్టపడతారు. వారికి మంచి వినోదాన్ని మా ‘పప్పు’ అందిస్తుంది - అని అన్నారు ‘పప్పు’ నిర్మాతలలో ఒకరైన నగేష్ యాద.

వరంగల్ జిల్లా నుండి పదేళ్ళ కిందట ఎం.ఐ.ఎస్ చదువు కోస ఆస్ట్రేలియా వెళ్ళిన నేను అక్కడే పెట్రో స్టేషన్స్ నిర్వహిస్తున్నాను. సినిమాలు తీయాలనేది ఎప్పటి నుండో ఉన్న కోరిక. టేబుల్ టెన్నిస్ మిత్రుడు ప్రవీణ్ తో కలిసి ఈ చిత్రం ప్లాన్ చేశాం. సపన్ స్ర్కిప్టు బాగా నచ్చింది. బాగా నవ్వించింది. ఈ చిత్రం ద్వారా నిర్మాతలుగా మా ఇద్దరం, దర్శకుడిగా సపన్, సంగీత దర్శకుడిగా ఫణి కళ్యాణ్, విలన్ గా జునైద్, హీరోయిన్ గా దీపిక పరిచయం అవుతున్నాం. అమెరికా నుండి వచ్చిన దీపిక మంచి నటి, డాన్సర్. బాలీవుడ్ చిత్రాల్లో చేసిన అనుభవం ఉంది. ఫణి కళ్యాణ్ అందించిన సంగీతం రెహమాన్ తరహాలో ఉంటుంది. ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన కృష్ణుడు, సుబ్బరాజు చాలా సహకరించారు. దర్శకుడు సపన్ అనుకున్న ప్రకారం బడ్జెట్ లో చిత్రాన్ని చేసి ఇచ్చారు. ఆ విషయంలో మేం హ్యాపీగా ఉన్నాం. తొలి చిత్రమే ఓ మంచి చిత్రం అందిస్తున్నందుకు ఆనందంగా ఉంది - అని అన్నారు నగేష్.

- రాజేష్

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com