Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
‘పప్పు’గా కృష్ణుడు
      ‘వినాయకుడు’గా మెప్పించిన కృష్ణుడు ఇప్పుడు ‘పప్పు’గా వస్తున్నాడు. సపన్ పసుపర్తి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రంలో పప్పుగా కృష్ణుడు నటిస్తుంటే, అతని జంటగా దీపిక చేస్తోంది. ఈ చిత్రం టాకీ పూర్తయిన సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ - ‘అష్టాచెమ్మా’ సమయంలోనే సపన్ ఈ కథ చెప్పారు. విభిన్న రసాలు ఉండే కథతో ఈ చిత్రం ఉంటుంది. చాలా బాగా వచ్చింది. ‘వినాయకుడు’ కన్నా బాగుంటుంది - అని అన్నారు.

నటుడు సుబ్బరాజు మాట్లాడుతూ - స్నేహం, ప్రేమతో ఈ చిత్రం ఉంటుంది. చక్కటి మూవీ. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. కృష్ణుడు ఇంతవరకూ చేయనివి ఈ చిత్రంలో చాలా చేశాడు - అని అన్నారు. దర్శకుడు సపన్ మాట్లాడుతూ - ఇందులో ముద్దొచ్చే కృష్ణుడు, మొరటుగా ఉండే సుబ్బరాజు కలిసి చేయడం విశేషం. అమ్మ రాజశేఖర్ ఇందులో కృష్ణుడితో డాన్స్ చేయించారు. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ చేయించారు. నిర్మాతలతో సహా యూనిట్ అంతా ప్రేమించి ఈ చిత్రానికి బాగా పని చేశారు. డబ్బింగ్ దశలో చూస్తే బాగా ఎంజాయ్ చేస్తున్నాం - అని అన్నారు. నిర్మాతలు ప్రవీణ్, నగేష్ మాట్లాడుతూ - ఆస్ట్రేలియాలో ఉండే మేము సపన్ చెప్పిన కథ విని ఇన్ స్పైర్ అయ్యి ఈ చిత్రం చేస్తున్నాం. వినోదాత్మకంగా ఉండే ఈ చిత్రాన్ని మేలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం - అని అన్నారు. ఆర్య ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి ఫణి కళ్యాణ్ సంగీతాన్ని, కె.రాజేంద్ర ఫోటోగ్రఫీని అందించారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com