Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
‘పప్పు’ సక్సెస్ మీట్
     ఆర్య ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై కృష్ణుడు, సుబ్బరాజు హీరోలుగా సపన్ పశుపర్తి దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నల్లా, నగేష్ యాద సంయుక్తంగా నిర్మించిన ’పప్పు‘ (మిస్టర్ ఇంటిలిజెంట్) ఇటీవల విడుదలై విశేషాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు ప్రవీణ్ రెడ్డి నల్లా , నగేష్ యాద మాట్లాడుతూ ‘సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమా తొలిరోజునే మల్టీప్లెక్స్ లలో మూడు రోజులు హౌస్ ఫుల్ అయ్యాయి. చాలా ఆనందంగా వుంది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నామని చెబుతున్నారు. కృష్ణుడు, సుబ్బరాజు పాత్రలకు మంచి స్పందన వస్తోంది. పాటలను ప్రేక్షకులు థియేటర్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడు సపన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ రావటం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మా సంస్థ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం’ అన్నారు. దర్శకుడు సపన్ పశుపర్తి మాట్లాడుతూ ‘ఎన్నో సాధించాలనుకొంటూ ఏమీ సాధించలేని వ్యక్తిగా విలక్షణ పాత్రలో కృష్ణుడు కనిపిస్తాడు. సుబ్బరాజు, కృష్ణుడు పాత్రలు భిన్న దృవాలుగా వుంటాయి. ‘అదృష్టాన్ని మనమే సృష్టించుకోవాలనే’ సందేశం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అన్ని కమర్షియల్ అంశాలతో వినోదాత్మకంగా సాగే ఈ చిత్రాన్ని ప్రతి ప్రేక్షకుడూ ఎంజాయ్ చేస్తున్నారు. కృష్ణుడు కేరెక్టరైజేషన్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. కొత్త దనాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపించారు’ అన్నారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com