Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
జెరూసలేంలో పవన్ క్రీస్తు చిత్రం ప్రారంభం
     గతంలో ‘‘పుష్పక విమానం’’, ‘‘విచిత్ర సోదరులు’’, ‘‘భైరవ ద్వీపం’’, ‘‘ఆదిత్యా 369’’ వంటి విజయవంతమైన చిత్రాలను దర్శకత్వం వహించిన సింగీతం శ్రీనివాసరావు గారు జీసస్ క్రైస్ట్ జీవితంపై నిర్మిస్తున్న సినిమాని ఇంగ్లీష్, హిందీ, తెలుగు మరియు మళయాళ భాషలలో అంతర్జాతీయ సాంకేతిక విలువలతో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

ప్రముఖ నిర్మాత, ఆదిత్యా ప్రొడక్షన్స్ అధినేత కొంద కృష్ణంరాజు ‘విజయేంద్రవర్మ’, ‘శ్రీరామదాసు’ వంటి భారీ చిత్రాల తర్వాత ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

ప్రముఖ హీరో ‘‘పవర్ స్టార్’’ పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి ప్రాణప్రదమైన ఓ ముఖ పాత్రను ఫోషించడం విశేషం.

ఈ ప్రతిష్టాత్మ చిత్రం ప్రారంభోత్సవం ఈ రోజున పవిత్ర స్థలం అయిన జెరూసలేంలో జరిగినది. అంతర్జాతీయ మీడియా వారితో మరియు భారతదేశంలో ముంబాయి, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు మరియు కొచ్చిన్ లోని మీడియా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చిత్ర యూనిట్ సభ్యులు ప్రత్యక్షంగా మట్లాడారు. ఇందు భారత్ పవర్ గ్రూప్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ అయిన కె.రఘుగారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ తో సంభాషించినారు.

పచిత్ర దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ - జీసస్ క్రైస్ట్ కథతో ఇప్పటిదాకా ‘‘కింగ్ ఆఫ్ కింగ్స్’’, ‘‘జీసస్ ఆఫ్ నజరత్’’, ‘‘ఫ్యాషన్ ఆప్ క్రైస్ట్’’ లాంటి ప్రముఖ చిత్రాలు చాలా వచ్చాయి. అయినప్పటికీ అందరికీ తెలసిన ఈ కథని చేయటము సాహసమే అయినా అది స్వీకరించాము. నేను, కథా రచయిత భారవిగారు, నిర్మాత కొండ కృష్ణంరాజుగారు సంవంత్సరంన్నర కాలంగా ఈ కథ మీద దృష్టి కేంద్రీకరించి ఈ కథని ఎలా ప్రజెంట్ చేయాలా అన్న విషయంపై పని చేసాం.

పఎన్నో మలుపులతో కూడిన అద్భుతమైన డ్రామా ఉన్న కథ ఇది. క్రీస్తు పుట్టిన దగ్గర నుంచి 12 ఏళ్ళ వరకు ఏం చేసారో ప్రంపంచం అంతా తెలుసు. 12 ఏళ్ళ తరువాత మళ్ళీ 30 ఏళ్ళకే క్రీస్తు కనిపించారు. 33 ఏళ్ళ వరకు జీవించారు. అయితే ఆ 18 ఏళ్ళు ఆయన భారతదేశానికి వచ్చి హిమాలయాలలో సాధువులతో కలిసి వున్నారని రకరకాల పుకార్లు తప్ప, ఖచ్చితంగా ఇదీ అని ఎవరూ నిర్ధారించలేదు. 30వ ఏట క్రీస్తు ముందుకు వచ్చి, ఏ ఉద్దేశంతో భగవంతుడు ఆయన్ని భూమ్మీదకు పంపించాడో ఆ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించాడు. చిన్న గ్రామం నుండి ఆరంభమైన ఆయన యాత్ర గ్రామగ్రామంలో పాకి ప్రపంచమంతా వ్యాపించి ప్రజలందరూ ఆరాధించి,పూజించే మహత్తరశక్తిగా ఎదిగింది. ఏసుక్రీస్తుకు వస్తున్న ఆదరణ చూసి రోమన్ చక్రవర్తి సహించలేక క్రీస్తును 33వ ఏటనే శిలువ వేయడం జరిగింది.

పఈ కథలో క్రీస్తు పుట్టుక నుండి, శిలువ వేయడం దాకా అంతా ఉంటుంది. ఈ చిత్రంలో ముఖ్యంగా క్రీస్తు చరిత్రని రెగ్యులర్ నటీనటులతో కాకుండా, తొలిసారిగా 10 నుండి 14 సంవత్సరాల బాల నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాల నటీనటులు నటిస్తున్నందు వల్ల మేకప్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవలసిన అవసరం వున్నందున ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేకప్ మెన్ లందరి గురించి వాకబు చేయగా క్రిస్టియానా టిన్స్ లే అనే గొప్ప మేకప్ మెన్ ను ఈ చిత్రానికి పెట్టాలని మేము నిర్ణయించుకున్నాం. ఈయన గతంలో ఆస్కార్ నామినేషన్ కి వెళ్ళిన ‘‘ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్’’కి మేకప్ చేసారు. అలాగే హిందీలో అమితాబ్ గారి ‘‘పా’’ చిత్రానికి వర్క్ చేసారు. ఈ చిత్రం కాన్సెప్ట్ ని పంపగానే ఆయన వెంటనే స్పందించారు. ఈ సినిమాకి నేను పనిచేయడమే కాకుండా, ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా నేను మీతోనే ఉంటాను అని మాట ఇవ్వటం జరిగింది.

పఈ చిత్రం గురించి చెప్పబోయే ముఖ్యమయిన విషయం ఏమిటంటే... ఈ చిత్రం కథ మీద పని చేస్తున్నప్పుడు ఈ చిత్రాన్ని వైవిధ్యంగా నడిపించుటకు, ఈ చిత్రానికి ప్రాణం లాంటి ఓ పాత్ర వచ్చింది. అలాంటి గొప్ప పాత్రకి ఎవరైతే బాగుంటారు అని బాగా ఆలోచించి మేము పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుందని అనుకున్నాం. ఈ చిత్రం కాన్సెప్ట్ ని, తను పోషించాల్సిన కేరెక్టర్ ని విని ఎంతో ఇన్ స్పైర్ అయి వెంటనే పవన్ కళ్యాణ్ గారు అంగీకంరించారు. ఈ క్యారెక్టర్ ని పవన్ కళ్యాణ్ గారు స్టడీ చేసిన తీరు అద్భుతం. ఆయన పరిశీలనా శక్తి అమోఘం.

పనిర్మాత కొండ కృష్ణంరాజు మాట్లాడుతూ - ‘భారతదేశంలో నిర్మాణమవుతున్న హయ్యస్ట్ బడ్జెట్ ఫిలిమ్స్ లో ఇది ఒకటి అవుతుంది. సింగీతం శ్రీనివాసరావుగారు ఈ చిత్రం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ చిత్రంలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఆయన పాత్రని మేము ముందుగా ఏనిమేషన్ లో ప్రజెంట్ చేసినప్పుడు ఆయన ఆశ్చర్యంతో, మన తెలుగు ఇండస్ట్రీలో ఇలా క్యారెక్టర్ ని ఏనిమేట్ చేసి ప్రజెంట్ చేయ్యడం జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు అన్నారు. అలాగే మళయాళంలో కూడా ఈ పాత్రని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. తెలుగు మరియు మళయాళంలో ప్రముఖ హీరోయిన్లు వేరు వేరుగా పవన్ కళ్యాణ్ గారితో చేస్తారు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో అక్కడ ప్రముఖ తారలు నటిస్తారు. ఆదిత్యా ప్రొడక్షన్స్ సంస్థకి ఇది ఓ ప్రెస్టేజియస్ మూవీ అవుతుందని గ్యారంటీగా చెప్పగలను’ అన్నారు.

పఈ చిత్రానికి రచన : జె.కె.భారవి, ఫోటోగ్రఫీ : శేఖర్.వి.జోసఫ్, ఆర్ట్ : రవీందర్, మేకప్ : క్రిస్టియానా టెన్స్ లే (U.S.A), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శేషు, నిర్మాత: కొండా కృష్ణంరాజు, దర్శకత్వం : సింగీతం శ్రీనివాసరావు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com