Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
పవన్‌తో క్రీస్తు గాథ
     'కథల్ని ఒప్పుకోవడంలో, పాత్రల్ని నమ్మడంలో మన కథానాయకుల దృక్పథం మారుతున్నట్టే కనిపిస్తోంది. ఓ కథ నచ్చితే అందులోని పాత్ర కోసం హోదాల్ని సైతం పక్కనపెడుతున్నారు. అందుకు మరో ఉదాహరణ ఇది... ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చిత్రంలో నటించడానికి పవన్‌కల్యాణ్‌ పచ్చజెండా వూపారు. విషయం ఏమిటంటే - ఆదిత్య ప్రొడక్షన్స్‌ సంస్థ ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. సింగీతం దర్శకత్వం వహిస్తారు. జీసస్‌ క్రైస్ట్‌ జీవితగాథతో అల్లుకొనే చిత్రమిది. 12 - 14 సంవత్సరాల మధ్య వయసున్న చిన్నారులే ఇందులో నటిస్తారు. అయితే బాల నటుల చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ పాత్ర ఏమిటన్నదే సస్పెన్స్‌. నిర్మాత కొండ కృష్ణంరాజు చిత్ర వివరాల్ని వెల్లడిస్తూ ''ఇప్పటి వరకూ క్రీస్తు కథతో ఆంగ్లంలో 47 చిత్రాలొచ్చాయి. బెన్‌హర్‌, కింగ్‌ ఆఫ్‌ కింగ్స్‌, టెన్‌ కమాండ్‌మెంట్స్‌ లాంటివి ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇప్పటి వరకూ క్రీస్తు జీవితాన్ని ఎవరూ బాల నటులతో చిత్రంగా రూపొందించలేదు. ఆ ప్రయోగాన్ని మేం చేయబోతున్నాం.అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటుందీ చిత్రం. దీంట్లో అత్యంత ముఖ్యమైన పాత్రను పవన్‌కల్యాణ్‌ పోషిస్తారు. ఆ పాత్ర ఏమిటన్నది సస్పెన్స్‌. ఇంగ్లిష్‌, హిందీ భాషల్లోనూ అగ్రస్థాయి నటులే ఆ పాత్రను పోషిస్తారు. ఆస్కార్‌ పురస్కారం అందుకున్న హాలీవుడ్‌ మేకప్‌ కళాకారుడు క్రిస్టీన్‌ టిన్స్‌లే ఈ సినిమాకి పని చేయడం విశేషం. క్రిస్టిన్‌ 'ప్యాసన్‌ ఆఫ్‌ క్రైస్ట్‌'కి మేకప్‌ చేశారు. ఈ నెల 30న ముంబయిలో చిత్రీకరణ ప్రారంభమవుతుంద''న్నారు. ఛాయాగ్రహణం: శేఖర్‌ వి.జోసెఫ్‌, కళ: రవీందర్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: శేషు, రచన: జె.కె.భారవి.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com