Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
పవన్‌కళ్యాణ్‌తో గణేష్‌బాబు చిత్రం
      ఇటీవల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న కారణంగా 'జల్సా' తర్వాత పవన్‌కళ్యాణ్‌ తదుపరి సినిమాకి కాస్త విరామం ఎక్కువైంది. అందుకే ఆయన రాబోయే చిత్రం 'పులి' కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇకపై అభిమానులను ఉత్సాహపరచడానికే తొలి ప్రాధాన్యతనిస్తున్నట్లు పవన్‌కళ్యాణ్‌ చెప్పారు. అందులో భాగంగానే 'పులి' టాకీ పూర్తయిన వెంటనే ఆయన తరువాతి చిత్రానికి రంగం సిద్ధం అయ్యింది. గణేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

హరీష్‌శంకర్‌ దీనికి దర్శకుడు. ఈ సినిమా గురించి గణేష్‌బాబు మాట్లాడుతూ- "పవర్‌స్టార్‌తో చేయనున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టిస్తుంది. పక్కా స్క్రిప్ట్‌ రెడీ అయ్యింది. అద్భుతమైన కథ, కథనాలతో ఈ సినిమా ఉంటుంది. ఇది ఓ రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. భారీ ఎత్తున చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఇందులో ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు నటిస్తారు. గతంలో పవన్‌కళ్యాణ్‌ సూపర్‌హిట్‌ చిత్రానికి సంగీతం చేసిన యువ సంగీత దర్శకుడు ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తారు. అలాగే ఇటీవల బాలీవుడ్‌లో ఓ సంచలన విజయం సాధించిన చిత్రానికి కెమెరామెన్‌గా పనిచేసిన టాప్‌ టెక్నీషియన్‌ ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ అందిస్తారు.

ఓ ప్రముఖ ఫైట్‌ మాస్టర్‌ పవన్‌కళ్యాణ్‌తో తొలిసారి చేయబోతున్నారు. సాంకేతికపరంగా అత్యున్నతస్థాయిలో నిర్మితమయ్యే ఈ చిత్రం పవర్‌స్టార్‌ కెరీర్‌లో సంచలనాత్మక చిత్రం అవుతుందని నమ్మకంతో చెబుతున్నాను. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తాం' అని తెలిపారు. డిసెంబరులో షూటింగ్‌ ముహూర్తం జరుగుతుందని, జనవరి, ఫిబ్రవరి నెలల్లో షెడ్యూల్‌ స్టార్ట్‌ అయి ఏకధాటిగా షూటింగ్‌ జరుపుకుంటుందని సమర్పకుడు బడే రవి చెప్పారు. పరమేశ్వర ఆర్ట్స్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com