Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
4న వస్తున్న ‘పెరియార్ రామస్వామి’
      కులరహిత సమాజం కోసం పోరాడిన మహనీయుడు పెరియార్‌ రామస్వామి. ఆయన జీవితచరిత్ర ఆధారంగా తెరెక్కి తమిళనాట ఘనవిజయం సాధించిన ‘పెరియార్‌ రామస్వామి నాయకర్‌’ తెలుగులో అదే పేరుతో సెప్టెంబర్‌ 4న ఇక్కడ విడుదలవుతోంది. సత్యరాజ్‌, ఖుష్భూ, కైకాల సత్యనారాయణ ప్రధానపాత్రల్లో నటించారు. ఐఏఎస్‌ అధికారి జ్ఞాన రాజశేఖర్‌ దర్శకత్వం వహించారు. విడుదల సందర్భంగా హైైదరాబాద్‌ ప్రసాద్‌లాబ్స్‌లో సినిమా ప్రివ్యూషో ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికే యుల సమావేశంలో కత్తి పద్మారావు, ఆర్‌.నారాయ ణమూర్తి, జె.బి.రాజు, మాస్టార్జీ, కారెం శివాజీ తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌.నారాయణమూర్తి మాట్లా డుతూ ‘ఈ సినిమాకి కత్తి పద్మారావు అద్భుతమైన సంభాషణలు అందించారు. అధికారం కులప్రాతిప దికన ఇవ్వాలని చెప్పిన సినిమా ఇది. అన్ని కులాల వారూ చూసి తీరాలి’ అన్నారు. చిత్రానికి పాటలు రాసిన జె.బి.రాజు మాట్లాడుతూ ‘సత్యరాజ్‌ నటన సహా పాటల్లో సాహిత్యం మెప్పిస్తుంది. కులాల్లో నెలకొని ఉన్న స్తబ్ధతను తొలగించి ప్రేరణనిచ్చే సినిమా ఇది. నిర్మాత ధన్యుడు. మార్పుకోసం ఈ సినిమా చూడండి’ అన్నారు. నిర్మాత సునీల్‌.పి మాట్లాడుతూ ‘సెప్టెంబర్‌ 4న ఆంధ్రప్రదేశ్‌ అంతటా విడుదల చేస్తున్నాం. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన పాటలకు మంచి స్పందన వచ్చింది. వందేమాతరం పాడిన పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమాని ఆదరించండి’ అన్నారు. సమర్పణ: నాగ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com