సత్యరాజ్, ఖుష్బు, జ్యోతిర్మయి, కైకాల సత్యనారాయణ ప్రధాన
పాత్రలలో రూపొందిన చిత్రం 'పెరియార్ రామ స్వామి నాయకర్'.
తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో నాగ్
ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై తెలుగులోకి అనువదించారు. కాగా అన్ని
కార్యక్రమాలు ముగించుకుని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి
నిర్మాత సునీల్.పి మాట్లాడుతూ...'పెరియార్ రామస్వామి జీవిత
చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమా కమర్షియల్‌గానే కాకుండా
సమాజానికి ఔషదంలాంటిది. ఈ సినిమాకు కత్తి పద్మారావు మాటలు
రాస్తే బాగుంటుందని రాయించాము. అలాగే హీరో సత్యరాజ్‌కి డబ్బింగ్
చెప్పిన రవికి ఇది మూడువేలవ చిత్రం. సెన్సార్ పూర్తయింది. ఈనెల
9న ప్రీమియర్ షోను ఐమాక్స్‌లో ఏర్పాటుచేశాం. ఈ కార్యక్రమానికి
స్టాలిన్, సత్యరాజ్, కుష్బులు వస్తున్నారని' చెప్పారు. కాకి
మాధవరావు మాట్లాడుతూ...'అంబేద్కర్ సినిమా స్పూర్తితో ఈ
సినిమా చేయడం జరిగింది. సమాజంలో కులతత్వాన్ని పెకిలించడానికి
పెరియార్ రామస్వామి సమాజానికి చేసిన ఈ ప్రయాణం చాలా బాగుంది.
మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ మాటలు వింటుంటే
మోదుకూరి జాన్సన్‌గారు గుర్తుకు వస్తున్నారు. తెలుగులోనూ ఈ చిత్రం
విజయవంతమ వుతుందనే నమ్మకముందని తెలిపారు.
జె.బి.రావు మాట్లాడుతూ...'తమిళ్‌లో 100రోజులు ఆడిన ఈ
సినిమా తెలుగులో కూడా ఆడుతుందనే నమ్మకముంది. గత
40సంవత్సరాల నుండి అంబేద్కర్ ఆశయాలతో ముందుకు
పోతున్నాము. కులం వున్నంత కాలం అన్యాయాలు, అక్రమాలు
జరుగుతూనే వుంటాయి. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సునీల్ గారిని దళిత
సంఘం తరపున అభినందనలు అన్నారు. కత్తి పద్మారావు మాట్లాడు
తూ... 'తెలుగు సినిమా చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి ఈ
సినిమా తెరదీయనుంది. పెరియార్ రామస్వామి జీవితంతో తయారైన
ఒక మహౌన్నతమైన కళాఖండానికి మాటలు రాసే అవకాశం
వచ్చినందుకు ఆనందంగానూ ఉంది. తెలుగు సినిమా పరిణామక్రమంలో
కొన్ని సందేశాత్మక చిత్రాలు వచ్చాయి. అల్లూరి సీతారామరాజు,
గాంధీ, అంబేద్కర్‌లాంటి మంచి చిత్రాల కోవలో ఈ చిత్రమూ ఉంటుంది.
ఒక సామాజిక ఆర్థిక, రాజకీయ పరిణామాలను చూడాలంటే ఈ సినిమా
చూడాలి. సత్యరాజ్ అద్భుతంగా నటించారు. ఒక ఉద్యమకారునిగా
నాకు చాలా సంతృప్తినిచ్చింది' అన్నారు. ఈ చిత్రానికి పాటలు:
గోరెటి వెంకన్న, డా|| విద్యాసాగర్ అంగళకుర్తి,, జె.పి. రాజు,
సంగీతం: విద్యాసాగర్, ఫొటోగ్రఫీ: తంగర్‌బచ్చన్, ఎడిటింగ్:
లెనిన్, ఆర్ట్: జె.కె., దర్శకత్వం: జ్ఞాన రాజశేఖర్.