నాని కథానాయకుడిగా అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పిల్ల జమిందార్‘. హరిప్రియ, బిందుమాధవి
హీరోయిన్లు. శ్రీ శైలేంద్ర సినిమాస్ పతాకంపై మాస్టర్ ఎస్.ఎస్.బుజ్జిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డి.ఎస్.రావు
సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. విజయదశమికి ఈ చిత్రం విడుదలకు
సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు డి.ఎస్.రావు మాట్లాడుతూ - నాని హీరోగా మా సంస్థలో నిర్మిస్తున్న వినోదాత్మక
కుటుంబ కథా చిత్రమిది. టోటల్ షూటింగ్ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
వచ్చేవారంలో ఆడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేయనున్నాము. దసరాకు సినిమాను ప్రేక్షకుల ముందుకు
తీసుకువస్తాము. నాని కెరీర్ లో మరో సూపర్ హిట్ గా ఈ చిత్రం నిలువనుందన్నారు.
దర్శకుడు అశోక్ మాట్లాడుతూ- కొన్ని కారణాల దృష్ట్యా ఓ జమీందారీ కుర్రాడు సాధారణ జీవితం గడపాల్సి వస్తుంది.
అది దేని కోసమనేది తెరమీద చూడాల్సిందే. ఆద్యంతం వినోదాన్ని అందించె యూత్ ఫుల్ మూవీ ‘పిల్ల జమీందార:’. నాని
నటన అందరిని ఆకట్టుకుంటుంది. సెల్వ అందించిన పాటలు హైలెట్ గా నిలుస్తాయి. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే
అంశాలుంటాయన్నారు. ఎం.ఎస్.నారాయణ, డా.శివప్రసాద్, నాగీనీడు, రావురమేష్, సమీర్, రణధీర్,. వెన్నెల కిషోర్,
తాగుబోతు రమేష్, ధనరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు :చంద్రశేఖర్, సంగీతం : సెల్వగణేష్, కెమెరా :
సామిశ్రీరామ్, కూర్పు : ప్రవీణ్.