Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
‘పిరానా’ 3D
      1981లో జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో రూపొందిన' పిరానా 2' చిత్రాన్ని ప్రేరణగా తీసుకొని అలెగ్జాండర్‌ ఆజా దర్శకత్వంలో డైమెన్షన్‌ ఫిలింస్‌ నిర్మించిన హాలీవుడ్‌ చిత్రం 'పిరానా 3డి'. అత్యాధునిక సాంకేతిక విలువలతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులోకి కూడా అనువదించారు. ఈ నెల 27న లేదా వచ్చే నెల 2న ఇండియాలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

కాగా ఈ చిత్రాన్ని నైజాం ఏరియాకు ఎస్వీఆర్‌ మీడియా అధినేత శోభారాణి పంపిణి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ " తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం విజువల్‌ ట్రీట్‌లా వుంటుంది. మనసుషులను తినే పిరానా అనే భయంకరమైన చేపలు విక్టోరియా లేక్‌లో సృష్టించిన బీభత్సమే ఈ 'పిరానా 3' కథాంశం. తప్పకుండా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం వుంది' అన్నారు. ఈ సమావేశంలో హీరా ఫిలింస్‌ ప్రతినిధి ముఖేష్‌ కూడా పాల్గొన్నారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com