సునీల్, ఇషాచావ్లా జంటగా ఆర్‌ఆర్ మూవీమేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై 'అహనాపెళ్ళంట'డైరెక్టర్ వీరభద్రం దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న 'పూలరంగడు' చిత్రాన్ని జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ - ''నాన్‌స్టాప్‌గా ఈ చిత్రం షఉటింగ్ జరుగుతోంది. సినిమా చాలా బాగా వస్తోంది. డిసెంబర్‌కల్లా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. జనవరి 14న సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. సునీల్ కెరీర్‌లోనే అత్యధిక ప్రింట్లతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. ఆర్.ఆర్. మూవీ మేకర్స్ వెంకట్‌గారి సమర్పణలో మాక్స్ ఇండియా బేనర్‌పై నిర్మించిన తొలి చిత్రం 'ప్రేమకావాలి' మంచి విజయాన్ని సాధించింది. మళ్ళీ ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సునీల్ సరసన 'ప్రేమకావాలి' హీరోయిన్ ఇషా చావ్లా నటిస్తోంది. ప్రేమకావాలి చిత్రాన్ని మ్యూజికల్ హిట్ చేసిన అనూప్ 'పూలరంగడు' చిత్రానికి కూడా సూపర్‌హిట్ మ్యూజిక్ ఇస్తున్నారు. తప్పకుండా మా బేనర్‌లో మరో సూపర్‌హిట్ చిత్రంగా 'పూలరంగడు' నిలుస్తుందన్న నమ్మకం నాకు వుంది'' అన్నారు.
సునీల్, ఇషాచావ్లా, కోట శ్రీనివాసరావు, ఆలీ, ప్రదీప్ రావత్, రఘుబాబు, దేవ్‌గిల్, పృధ్వి, సుధ, ప్రగతి, శ్రీలలిత, సత్యంరాజేష్, దువ్వాసి మోహన్, ఖలీల్, ప్రవీణ్, వేణుగోపాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మేకప్: నాగు, కాస్ట్యూమ్స్: ప్రసాద్, స్టిల్స్: ఎస్.ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శ్రీరాములు, కో డైరెక్టర్: గంగాధర్, ప్రొడక్షన్ కంట్రోలర్స్: కొత్తపల్లి మురళీకృష్ణ, బూరుగుపల్లి శ్రీనివాస్, ఆర్ట్: నాగేంద్ర, మాటలు: శ్రీధర్ సీపన, ఎడిటింగ్: గౌతంరాజు, సినిమాటోగ్రఫి: ప్రసాద్‌మురెళ్ళ, సంగీతం: అనూప్ రూబెన్స్, సమర్పణ: ఆర్.ఆర్. మూవీ మేకర్స్ నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వీరభద్రం.