సునీల్, ఇషాచావ్లా జంటగా ఆర్‌ఆర్ మూవీమేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై 'అహనా పెళ్ళంట' డైరెక్టర్ వీరభద్రం
దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న 'పూలరంగడు' చిత్రాన్ని జనవరి 14న వరల్డ్‌వైడ్‌గా 450 థియేటర్లలో సంక్రాంతి
కానుకగా విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ - '''పూలరంగడు' చిత్రానికి సంబంధించి ప్రస్తుతం క్లైమాక్స్ భారీ ఎత్తున
జరుగుతోంది. 4 పాటలు మినహా "షూటింగ్ పూర్తయింది. అందాల రాముడు, మర్యాద రామన్న చిత్రాలతో హీరోగా ఓ ప్రత్యేక ఇమేజ్‌ను
సంపాదించుకున్న సునీల్‌ను 'పూలరంగడు'లో కొత్త యాంగిల్‌లో కనిపించబోతున్నారు. సునీల్ కెరీర్‌లోనే అత్యధికంగా 450 థియేటర్లలో ఈ
చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేస్తున్నాం. ఆర్.ఆర్. మూవీ మేకర్స్ వెంకట్‌గారి సమర్పణలో మాక్స్ ఇండియా బేనర్‌పై నిర్మించిన తొలి చిత్రం
'ప్రేమకావాలి' మంచి విజయాన్ని సాధించింది. మళ్ళీ ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సునీల్ సరసన
'ప్రేమకావాలి' హీరోయిన్ ఇషా చావ్లా నటిస్తోంది. ప్రేమకావాలి చిత్రాన్ని మ్యూజికల్ హిట్ చేసిన అనూప్ 'పూలరంగడు' చిత్రానికి కూడా
సూపర్‌హిట్ మ్యూజిక్ ఇస్తున్నారు. తప్పకుండా మా బేనర్‌లో మరో సూపర్‌హిట్ చిత్రంగా 'పూలరంగడు' నిలుస్తుందన్న నమ్మకం నాకు
వుంది'' అన్నారు.
సునీల్, ఇషాచావ్లా, కోట శ్రీనివాసరావు, ఆలీ, ప్రదీప్ రావత్, రఘుబాబు, దేవ్‌గిల్, పృధ్వి, సుధ, ప్రగతి, శ్రీలలిత, సత్యంరాజేష్,
దువ్వాసి మోహన్, ఖలీల్, ప్రవీణ్, వేణుగోపాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మేకప్: నాగు, కాస్ట్యూమ్స్: ప్రసాద్, స్టిల్స్: ఎస్.ప్రసాద్,
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శ్రీరాములు, కో డైరెక్టర్: గంగాధర్, ప్రొడక్షన్ కంట్రోలర్స్: కొత్తపల్లి మురళీకృష్ణ, బూరుగుపల్లి శ్రీనివాస్, ఆర్ట్: నాగేంద్ర,
మాటలు: శ్రీధర్ సీపన, ఎడిటింగ్: గౌతంరాజు, సినిమాటోగ్రఫి: ప్రసాద్‌మురెళ్ళ, సంగీతం: అనూప్ రూబెన్స్, సమర్పణ: ఆర్.ఆర్. మూవీ
మేకర్స్, నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వీరభద్రం.