ప్రభాస్ కథానాయకుడిగా లారెన్స్ దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీమీడియా పతాకంపై ప్రముఖ నిర్మాతలు
జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించే చిత్రం ‘రెబల్’ ఈనెల 3వ వారంలో ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ ‘ప్రభాస్ హీరోగా ఓ
సూపర్డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించాలన్న మా కోరిక ‘రెబల్’తో నెరవేరుతోంది. లారెన్స్ అద్భుతమైన
కథను సిద్ధం చేశారు. ప్రభాస్ సబ్జెక్ట్ విని ఎంతో ఉద్విగ్నులయ్యారు. భారీ సాంకేతిక విలువలతో సినిమా
తెరకెక్కుతోంది. అనుష్క కథానాయికగా నటిస్తోంది. మరో హీరోయిన్ ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.
నాన్స్టాప్గా చిత్రీకరణ జరుపుకునే ఈ చిత్రంలో ఎన్నో విశేషాలుంటాయి’ అన్నారు.
బ్రహ్మానందం, ముఖేష్ రుషి, కెల్లీ డార్జ్, షాయాజీ షిండే, అలీ, ఎం.ఎస్.నారాయణ, చలపతిరావు,
జయప్రకాష్రెడ్డి, సుప్రీత్, జీవా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు:
‘డార్లింగ్’ స్వామి, సంగీతం: తమన్, ఫైట్స్: రామ్లక్ష్మణ్, కళ: ఎఎస్.ప్రకాష్,
కథ-కథనం-దర్శకత్వం-డాన్స్: రాఘవ లారెన్స్.