Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
ప్రభాస్‌ పోరాటాలు! ‌‌
     ప్రభాస్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లిమిటెడ్‌ పతాకంపై కరుణాకరన్‌ దర్శకత్వంలో బోగవల్లి ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం కోసం బ్యాంకాక్‌లో జనవరి 1నుంచి ఫైట్‌మాస్టర్‌ పీటర్‌ హెయిన్స్‌ సారధ్యంలో భారీ ఫైట్‌ను పది రోజులపాటు చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్‌లో ప్రభాస్‌తో ఫారిన్‌ ఫైటర్స్‌ పాల్గొంటారు. ఈ చిత్రానికి ఈ ఫైట్‌ ఓ హైలైట్‌ అవుతుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మొదట్లో ‘డార్లింగ్’ అని పేరు పెట్టాలనుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఛత్రపతి’ వంటి సూపర్‌హిట్‌ చిత్రం తరువాత ప్రభాస్‌తో మా బేనర్‌లో చేస్తున్న చిత్రమిది. స్విట్జర్లాండ్‌, అరకులో వేసిన భారీ సెట్‌లో, హైదరాబాద్‌లో జరిపిన షెడ్యూల్‌తో 70శాతం పూర్తయింది.

బ్యాంకాక్‌ షెడ్యూల్‌ తరువాత హైదరాబాద్‌లో జరిగే మరో షెడ్యూల్‌తో ఫిబ్రవరికల్లా సినిమా మొత్తం పూర్తవుతుంది. ప్రభాస్‌ కెరీర్‌లో డిఫరెంట్‌ రొమాంటిక్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని కరుణాకరన్‌ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. మార్చిలో విడుదలయ్యే ఈ చిత్రం మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమాగా నిలుస్తుంది’’ అన్నారు. ప్రభాస్‌ సరసన కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరో ప్రభు ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

ప్రముఖ తారాగణం ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌, ఛాయాగ్రహణం: ఆండ్రూస్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాత: బోగవల్లి ప్రసాద్‌, దర్శకత్వం: కరుణాకరన్‌.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com