ఫిలిం న్యూస్
 
 
 
 
ప్రకాష్ రాజ్ చిత్రం ‘ధోనీ’

విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌ స్వీయనిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ధోని’. ఆయనే కథానాయకుడు. పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ ముఖ్యపాత్రధారి. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

ప్రకాష్‌ రాజ్‌ మాట్లాడుతూ - ‘‘డ్యూయెట్‌ మూవీస్‌ బేనర్‌ ఆరంభించి..ఎన్నో వైవిధ్యమైన చిత్రాల రూపకల్పనలో భాగం కావడం ఆనందాన్నిస్తోంది. ‘ధోని’లో నటించడమే గాక స్వయంగా నేనే నిర్ధేశకుడిని కావడం రెట్టింపు ఆనందాన్నిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కొనసాగుతోంది. అక్టోబర్‌ వరకూ ఏకధాటిగా హైదరాబాద్‌, చెన్నైలలో చిత్రీకరణ సాగిస్తాం. డిసెంబర్‌లో సినిమా రిలీజ్‌ చేస్తాం.

ఇళయరాజా ఈ సినిమాకి పాటలు సహా నేపథ్య సంగీతాన్ని లైవ్‌లో రికార్డింగ్‌ చేస్తున్నారు. వాయిద్యాన్ని ముందుగా రికార్డ్‌ చేసి ఆపై ఆధునిక సాంకేతికత ద్వారా మిక్స్‌ చేయడం అనే కొత్త పద్ధతిలో చేస్తున్నారాయన’’ అన్నారు.