ఫిలిం న్యూస్
 
 
 
 
విజయ యాత్రలో 'ప్రేమ కావాలి'
ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో, మాక్స్ ఇండియా ప్రొడక్ష్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి సాయికుమార్ తనయుడు ఆదిని హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన ‘ప్రేమకావాలి’ విడుదలైన అన్నిసెంటర్స్ లోనూ విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ విజయయాత్ర నిర్వహించింది. ఈ విజయయాత్ర విశేషాల గురించి...

నిర్మాత కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ - ‘‘వెళ్ళిన ప్రతిచోటా అద్భుతమైన రెస్పాన్స్ వుంది. పర్టిక్యులర్ గా యూత్ ఆడియన్స్ హీరో ఆదిని బాగా క్రేజీగా రిసీవ్ చేసుకుంటున్నారు. యూత్ అంతా ఆది, ఇషా చావ్లాలను అభినందిస్తూ కేరింతలు కొడుతూ వాళ్ళలో కలిసి డాన్స్ లు చెయ్యడం విశేషం. అలాగే అనూప్ మ్యూజిక్ ఆడియన్స్ కు బాగా నచ్చింది. అనూప్ తోపాటు ప్రేమకావాలి సాంగ్స్ కి ఆడియన్స్ గొంతు కలపడం అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఆదిని చూడగానే జనం ‘పోలీస్ స్టోరీ’లో సాయకుమార్ డైలాగ్స్ చెప్పించుకోవడం, ప్రేమకావాలిలో ఆది చెప్పిన డైలాగ్స్ చెప్పమనడం ఈ టూర్ లో హైలైట్. ప్రేక్షకులు హీరోహీరోయిన్లతో ఫోటోలు దిగడం కోసం, షేక్ హ్యాండ్ లు ఇవ్వడం కోసం పోటీలు పడ్డారు. యూత్ ఆడియన్స్ మా కన్వాయ్ వెంట ఉత్సాహంగా బైకుల మీద ఫాలో అవడం మరో విశేషం. ప్రతి సెంటర్ లోనూ ఆర్.ఆర్ మూవీ మేకర్స్ అభిమానులు, ఆది అభిమానులు, లోకల్ డిస్ర్టిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, నగర ప్రముఖులు మా యూనిట్ కి ఘనస్వాగతం పలికారు. గుంటూరులో ఇవివి యువకళావాహిని వారు ప్రేమకావాలి యూనిట్ ని ప్రత్యేకంగా సత్కరించారు. విజయవాడ శకుంతల థియేటర్ లో పెద్ద ఎత్తును ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. తిరుపతి, శ్రీకాళహస్తి, కడప, పీలేరు, పలమనేరు, మదనపల్లి, చిత్తూరు, కోడూరు, రాజంపేట, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, చిలకలూరిపేట, నర్సరావుపేట, గుంటూరు, తెనాలి, విజయవాడ కేంద్రాల్లో ఈ విజయయాత్ర దిగ్విజయంగా జరిగింది. అన్నిసెంటర్స్ లో ఎగ్జిబిటర్స్ ప్రేమకావాలి కలెక్షన్స్ పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చెయ్యడమే కాకుండా గ్యారెంటీగా ఇది 100 రోజులు మా థియేటర్ లో ప్రదర్శింపబడుతుంది అని చెప్పడం చాలా థ్రిల్ గా ఫీల్ అయ్యాంత. త్వరలో మరికొన్ని కేంద్రాల్లో విజయయాత్ర ప్లాన్ చేస్తున్నాం. ప్రేమకావాలి చిత్రాన్ని శతదినోత్సవ చిత్రంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’’ అన్నారు.

హీరో ఆది మాట్లాడుతూ - ‘‘అన్ని సెంటర్స్ లోనూ ప్రేక్షకులు, అభిమానులు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే ఎంతో ఆనందం కలిగింది. ‘ప్రేమకావాలి’ వంటి చిత్రాన్ని ఇచ్చి హీరోగా నాకు మంచి బ్రేక్ ఇచ్చిన ఆర్.ఆర్. మూవీ మేకర్స్ వెంకట్ గారికి, మాక్స్ ఇండియా అచ్చిరెడ్డిగారికి, దర్శకులు విజయబాస్కర్ గారికి, సురేష్ రెడ్డిగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అన్నారు.

హీరోయిన్ ఇషా చావ్లా మాట్లాడుతూ - ‘‘ఈ విజయయాత్రలో అంత మంది ప్రేక్షకులు అభిమానాన్ని ప్రత్యేక్షంగా చూడడం చాలా థ్రిల్లింగ్ గా వుంది’’ అన్నారు.

సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ - ‘‘ప్రేమకావాలి మ్యూజిక్ ఇంత పెద్ద హిట్ అయినందుకు.. టూర్ లో ఆడియన్స్ ఈ