డైలాగ్‌కింగ్ సాయికుమార్ తనయుడు ఆది హీరోగా పరిచయమవుతూ మాక్స్ ఇండియా పతాకంపై
తెరకెక్కుతున్న సినిమా ‘ప్రేమకావాలి’. ఇషాచావ్లా కథానాయిక. కె.అచ్చిరెడ్డి నిర్మాత.
కె.విజయభాస్కర్ దర్శకుడు. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా నిర్మాత కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ
‘వెనిస్, దుబాయ్‌లలో నాయకానాయికలపై చిత్రీకరించిన రెండు పాటలతో షూటింగ్ పార్ట్ పూర్తయింది.
ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో భాగంగా రీరికార్డింగ్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి
ఫిబ్రవరి రెండోవారంలో రిలీజ్ చేస్తాం. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చింది.
అనూప్ రూబెన్ సంగీతం అందించిన గీతాలు శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నోబుల్, రాబర్ట్
సబీన, జాని నేతృత్వంలో చేసిన పాటలు విజువల్‌గా చాలా అద్భుతంగా వచ్చాయి. చోటా కె.నాయుడు
ఫోటోగ్రఫీ సినిమాకే హైలైట్. విజయభాస్కర్ దర్శకత్వం వహించిన సినిమా ‘నువ్వేకావాలి’ తర్వాత ఆ
స్థాయి ఫీల్ ఉన్న సినిమా ఇది. మాక్స్ ఇండియా బేనర్‌కి మంచి పేరు తెస్తుందన్న నమ్మకముంది’
అన్నారు. !