ఫిలిం న్యూస్
 
 
 
 
సంక్రాంతికి 'పూలరంగడు'

సునీల్‌, ఇషాచావ్లా జంటగా ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌ సమర్పణలో మాక్స్‌ ఇండియా ప్రొడక్షన్స్‌ పతాకంపై 'అహనాపెళ్ళంట' డైరెక్టర్‌ వీరభద్రం దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న 'పూలరంగడు' మూడు పాటలు మినహా షఉటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ - ''ఈ చిత్రానికి సంబంధించిన మూడు పాటల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. మరోపక్క పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా చేస్తున్నాం. జనవరి మొదటి వారంలో ఈ చిత్రం ఆడియోను రిలీజ్‌ చేసి జనవరి 14న వరల్డ్‌వైడ్‌గా సినిమాను రిలీజ్‌ చేస్తున్నాం. అందాల రాముడు, మర్యాద రామన్న చిత్రాలతో హీరోగా ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్న సునీల్‌ను 'పూలరంగడు'లో కొత్త యాంగిల్‌లో కనిపించబోతున్నారు. సునీల్‌ కెరీర్‌లోనే అత్యధికంగా 450 థియేటర్లలో ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేస్తున్నాం'' అన్నారు.

దర్శకుడు వీరభద్రం మాట్లాడుతూ - ''నటీనటుల సహకారంతో అనుకున్న షెడ్యూల్‌లోనే చిత్రాన్ని పూర్తి చేస్తున్నాం. సునీల్‌ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌గా ఈ చిత్రం నిలుస్తుందన్న నమ్మకం నాకు వుంది. ఈ సంక్రాంతికి అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించడానికి జనవరి 14న రిలీజ్‌ అవుతోంది'' అన్నారు.

సునీల్‌, ఇషాచావ్లా, కోట శ్రీనివాసరావు, ఆలీ, ప్రదీప్‌ రావత్‌, రఘుబాబు, దేవ్‌గిల్‌, పృధ్వి, సుధ, ప్రగతి, శ్రీలలిత, సత్యంరాజేష్‌, దువ్వాసి మోహన్‌, ఖలీల్‌, ప్రవీణ్‌, వేణుగోపాల్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మేకప్‌: నాగు, కాస్ట్యూమ్స్‌: ప్రసాద్‌, స్టిల్స్‌: ఎస్‌.ప్రసాద్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శ్రీరాములు, కో డైరెక్టర్‌: గంగాధర్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్స్‌: కొత్తపల్లి మురళీకృష్ణ, బూరుగుపల్లి శ్రీనివాస్‌, ఆర్ట్‌: నాగేంద్ర, మాటలు: శ్రీధర్‌ సీపన, ఎడిటింగ్‌: గౌతంరాజు, సినిమాటోగ్రఫి: ప్రసాద్‌మురెళ్ళ, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సమర్పణ: ఆర్‌.ఆర్‌. మూవీ మేకర్స్‌ నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వీరభద్రం