Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
మే చివరిలో ‘పులి’
      పవన్‌కళ్యాణ్‌, దర్శకుడు ఎస్‌.జె.సూర్య కలయికలో ఇప్పుడు మరో చిత్రం రూపొందుతోంది. ఈ సారి ఎస్‌.జె.సూర్య పవన్‌కళ్యాణ్‌ని 'కొమరం పులి'గా ఓ పవర్‌ఫుల్‌ పాత్రలో చూపించనున్నారు. కనకరత్న మూవీస్‌ పతాకంపై శింగనమల రమేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక పాట మినహా షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ సినిమా మే మూడోవారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ " 'ఖుషి' లాంటి సూపర్‌హిట్‌ తర్వాత మా ఇద్దరి కలయికలో వస్తున్న చిత్రమిది. అభిమానులు, ప్రేక్షకులు పవన్‌ నుంచి ఎక్స్‌పెక్ట్‌ చేసే అన్ని అంశాలు ఇందులో వుంటాయి. 'కొమరం పులి'గా ఆయన పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా వుంటుంది' అన్నారు. నిర్మాత మాట్లాడుతూ -"బ్యాలెన్స్‌ సాంగ్‌ను ఈ నెల 25 నుంచి చిత్రీకరిస్తాం. 'కొమరం పులి'గా పవన్‌ నటన చిత్రానికి మెయిన్‌ హైలైట్‌.

ఈ కథ విన్న ఆస్కార్‌ విజేత సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ ఎంతో ఇన్‌స్పైర్‌ అయ్యి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ప్రస్తుతం ఆయన రీ-రికార్డింగ్‌ని లండన్‌లో చేస్తున్నాడు. పూర్తి వాణిజ్య అంశాలతో ,అత్యున్నత సాంకేతిక నిపుణులతో నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమా తప్పకుండా తెలుగు సినిమా స్టాండర్స్‌ని పెంచే విధంగా వుంటుంది. త్వరలోనే సోని మ్యూజిక్‌ ద్వారా ఆడియోని విడుదల చేసి మే మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం' అని తెలిపారు.

నికీషా పటేల్‌ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మనోజ్‌ బాజ్‌పాయ్‌, నాజర్‌, చరణ్‌రాజ్‌, అలీ, బ్రహ్మాజి, జ్యోతికృష్ణ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: బినోద్‌ కె.ప్రధాన్‌, ఆర్ట్‌: ఆనంద్‌సాయి, సమర్పణ: సత్యరామమూర్తి.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com