Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
పూరి - బాలకృష్ణల చిత్రం
      'సింహా'తో సరికొత్త చరిత్ర సృష్టించిన బాలకృష్ణ హీరోగా 'పోకిరి'తో సంచలనాత్మక రికార్డులు సృష్టించిన పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్‌ భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. సాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. దీని గురించి బెల్లంకొండ మాట్లాడుతూ - "బాలయ్యబాబు, పూరి జగన్నాథ్‌ల తొలి కాంబినేషన్‌లో మా బ్యానర్‌లో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. బాలయ్య కెరీర్‌లో ఓ అద్భుతమైన చిత్రంగా, పెద్ద రేంజ్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తాం. బాలయ్య, పూరి జగన్నాథ్‌ అంటే భారీ అంచనాలు నెలకొంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రం ఉంటుంది. మా బ్యానర్‌లో బాలయ్య హీరోగా ‘చెన్నకేశవరెడ్డి’‘, లక్షీనరసింహా’ వంటి హిట్‌ చిత్రాలను ఇచ్చాం. బాలయ్య కాంబినేషన్‌లో ఇది మాకు హ్యాట్రిక్‌ అవ్వాలనే పట్టుదలతో రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తాం. త్వరలో ఈ చిత్రం ఆరంభం కానుంది' అన్నారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com