సుమంత్ కథానాయకుడుగా ప్రియమణి, విమలా రామన్ కథానాయికలుగా వి.ఎన్.ఆదిత్య
దర్శకత్వంలో కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్న ‘రాజ్’ చిత్ర లోగో విడుదల కార్యక్రమం అన్నపూర్ణా
స్టూడియోస్ లో జరిగింది.
ఈ కార్యక్రమంలో సుమంత్, నిర్మాతలు కుమార్ బ్రదర్స్, దర్శకుడు
వి.ఎన్.ఆదిత్య, కమెడియన్ శ్రీనివాసరెడ్డి తదితరలు పాల్గొన్నారు. కార్యక్రమంలో లోగో
విడుదల కార్యక్రమం అనంతరం...
సుమంత్ మాట్లాడుతూ - ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. మొదటిసారిగా
ముక్కోణపు ప్రేమ కథలో నటిస్తున్నాను. సినిమా టైటిల్ ‘రాజ్’ అని వున్నా ఇది యాక్షన్
సినిమా కాదు. ఇదొక చక్కటి ప్రేమకథ. ఈ సినిమాలో నేనొక ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ గా
నటిస్తున్నాను. ఇక నుంచి సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తాను అన్నారు.
వి.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ - మంచి కథ, మంచి సాంకేతిక నిపుణులను
ఎన్నుకున్నారు సుమంత్. కారణాంతరాల వల్ల దర్శకుడు మారవలసి వచ్చి నాకు ఈ అవకాశం
కలిగింది. నిర్మాతలతో చాలా కంఫర్టబుల్ గా వుంది. సుమంత్, ప్రియమణి,
విమలారామన్ ల పెర్ ఫార్మెన్స్ బాగుంది. కోటి మంచి మ్యూజిక్ని ఇచ్చారు. నాగార్జునగారి
‘ఘరానా బుల్లోడు’లోని ‘భీమవరం బుల్లెమ్మ’ పాటను ఈ చిత్రంలో రీమిక్స్ చేసాం. ఈ
సినిమాలో ఆరు పాటలు వున్నాయి. కెమెరామెన్ జగన్ హీరో హీరోయిన్లను చాలా బాగా
చూపించాడు అన్నారు.
కుమార్ బ్రదర్స్ మాట్లాడుతూ - ఈ చిత్ర ఆడియోను డిసెంబర్ మొదటి వారంలో
విడుదల చేసి... ఆఖరివారంలో సినిమాని విడుదల చేయనున్నాం అన్నారు.