'రాజన్న'గా అక్కినేని నాగార్జున గెటప్ అద్భుతం.. 'రాజన్న'గా నాగార్జున నటన అపూర్వం.. 'రాజన్న' నిర్మాణం అన్నపూర్ణ
స్టూడియోస్‌కి అత్యంత ప్రతిష్టాత్మకం.. 'రాజన్న' చిత్రానికి విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తే ఎస్.ఎస్.రాజమౌళి
పర్యవేక్షణలో యాక్షన్ దృశ్యాల్ని చిత్రీకరించడం విశేషం. ఎం.ఎం.కీరవాణి సంగీతం ఈ చిత్రానికి ప్రాణం..
అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌లో కింగ్ నాగార్జున హీరోగా నటించి నిర్మాతగా నిన్నే పెళ్ళాడతా, మన్మథుడు, మాస్,
సూపర్ వంటి సూపర్‌హిట్ చిత్రాలు ఇచ్చారు. ఆ తర్వాత స్వంత చిత్రాల నిర్మాణానికి గ్యాప్ ఇచ్చిన నాగార్జున 'రాజన్న'
కథ వినగానే ఇన్‌స్పైర్ అయి ఇలాంటి అద్భుతమైన సబ్జెక్ట్‌ని అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌లో నేనే నిర్మిస్తాను అని ఈ
చిత్ర నిర్మాణానికి పూనుకోవడం జరిగింది. అంతగా మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసిన పాయింట్ ఏమిటి? అని నాగార్జునని అడిగితే
'రాజన్న' క్యారెక్టర్ నాకు ఎంతగానో నచ్చింది. ఇది ఓ ఫ్రీడమ్ ఫైటర్ కథ. స్వాతంత్య్ర పోరాటంలో జరిగిన మూడు నాలుగు
యదార్థ సంఘటనలను అద్భుతంగా తీసుకొని చేసిన రియలిస్టిక్ సబ్జెక్ట్ ఇది. 'రాజన్న' పాత్ర చెయ్యడం నాకు ఎంతో
సంతృప్తిని కలిగించింది. విజయేంద్రప్రసాద్‌గారు 'రాజన్న'ని బాగా డీల్ చేసారు. యాక్షన్ సన్నివేశాల్ని తీయడంలో తనకు
తానే సాటి అనిపించుకున్న రాజమౌళి ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల్ని ఎంతో ఇంట్రెస్ట్‌తో చిత్రీకరించడం విశేషం.
క్లైమాక్స్ ఈ సినిమాకి హైలైట్ అవుతుంది. కీరవాణిగారి సంగీతం ఈ చిత్రానికి ప్రాణం. అలాగే సినిమాలో అత్యంత కీలకమైన
పాత్రలో ఎనిమిదేళ్ళ బేబి ఏని నటన సూపర్బ్. 'రాజన్న' కథలో ఈ పాప పాత్రకు చాలా ప్రాముఖ్యత వుంది. 'రాజన్న' కోసం
ఎన్నో భారీ సెట్స్ నిర్మించి స్వాతంత్య్ర పోరాటం నాటి వాతావరణాన్ని క్రియేట్ చేశాం. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఈ సెట్స్‌ని
అద్భుతంగా వేసారు. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌లో వస్తోన్న ప్రెస్టీజియస్ మూవీ 'రాజన్న'. ఇలాంటి వైవిధ్యమైన
చిత్రాలు చేసే అవకాశం ఏ ఆర్టిస్టుకయినా చాలా అరుదుగా వస్తుంది. 'రాజన్న' చిత్రం నిర్మాణం పూర్తి కావచ్చింది. 'రాజన్న'
కోసం నేను కూడా ఎంతో ఎక్సైటింగ్‌గా ఎదురుచూస్తున్నాను. తప్పకుండా 'రాజన్న' చిత్రం అందర్నీ ఆకట్టుకునే
యూనివర్సల్ ఫిలిమ్. పేట్రియాటిక్ ఫీల్‌తో సాగే సినిమా ఇది. 'రాజన్న'లాంటి మంచి సినిమా చెయ్యడం ఆర్టిస్ట్‌గా నాకు
ఎంతో సంతృప్తిని కలిగిస్తోంది'' అన్నారు.
సెప్టెంబర్ 30 విడుదల!
అన్నపూర్ణ స్టూడియోస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 'రాజన్న' చిత్రం ఆంధ్రప్రదేశ్ అంతటా ఆర్.ఆర్. ఫిలిం
డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సెప్టెంబర్ 30న చాలా గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా,
నార్త్ ఇండియా, ఓవర్సీస్‌లలో 'రాజన్న' రిలీజ్‌ని పెద్ద లెవల్‌లో ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.
ఆగస్ట్ 29 కింగ్ నాగార్జున బర్త్‌డే సందర్భంగా 'రాజన్న' ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసారు. సెప్టెంబర్ 2వ వారంలో 'రాజన్న' ఆడియోను
వినూత్న రీతిలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లిమిటెడ్ పతాకంపై నిర్మాణమవుతున్న ఈ
చిత్రంలో కింగ్ నాగార్జున, స్నేహ, బేబి ఏని, శ్వేత మీనన్, నాజర్, అజరు, సుప్రీత్, ప్రదీప్ రావత్, ముఖేష్ రుషి, రవి కాలే,
గాంధీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, అనిల్ బండారి, పూర్ణ, ఆర్ట్:
రవీందర్ కె., ఫైట్స్: విజరు, రామ్‌లక్ష్మణ్, సెల్వ, సాల్మన్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, యాక్షన్ పర్యవేక్షణ: ఎస్.ఎస్.రాజమౌళి,
సమర్పణ: శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ, నిర్మాత: అక్కినేని నాగార్జున, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం:
విజయేంద్రప్రసాద్.