Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
రాజశేఖర్ ‘మా అన్నయ్య బంగారం’
      విశాఖ టాకీస్ పతాకంపై డా.రాజశేఖర్, కమలిని ముఖర్జీ జంటగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో నట్టికుమార్ నిర్మిస్తున్న ‘మా అన్నయ్య బంగారం’ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రోశయ్య హాజరుకావడం విశేషం. రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, ముఖేష్ గౌడ్, బాలినేని శ్రీనివాసరావు, అంబటి రాంబాబుతో పాటు డా.దాసరి నారాయణరావు, కృష్ణంరాజు, శ్రీహరి, డి.రామానాయుడు, కోడిరామకృష్ణ, సాగర్, పరుచూరి బ్రదర్స్, నారాయణమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రోశయ్య మాట్లాడుతూ - ఇటీవల సినిమా రంగం ఆటుపోట్లకు గురి అవుతోంది. చట్టానికి పదునుపెట్టి పైరసీని తరిమికొట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కుటుంబ సమేతంగా చూసేలా ఈ చిత్రం రూపొంది ప్రజాదరణ సాధించాలి - అని అన్నారు. దాసరినారాయణరావు మాట్లాడుతూ - పెద్ద, చిన్న తేడా లేకుండా మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రస్తుతం తెలుగు చిత్రం పరిశ్రమ మూడు, నాలుగు కుంటుంబాల చేతుల్లో చిక్కుకుంది. వారినుండి బయటకు తీసుకురావాలి. యాక్షన్ లో కన్నా ఫ్యామిలీ చిత్రాల్లోనే రాజశేఖర్ ని ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తారు. నట్టికుమార్ ఈ చిత్రంతో పెద్ద నిర్మాత కావాలి - అని అన్నారు.

డా.రాజశేఖర్ మాట్లాడుతూ - మన సెంటిమెంట్స్ ని చెప్పే మంచి కథని భూపతిరాజా ఇచ్చారు. హోమ్లీ హీరోయిన్ కమలిని ముఖర్జీతో, ఫ్యామిలీ సంగీత దర్శకుడు రాజ్ కుమార్ తో జొన్నలగడ్డ శ్రీనివాసరావు దీన్ని పెద్ద హిట్ చేయాలనుకుంటున్నాడు - అని అన్నారు. జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ - మంచి సినిమాకి అవసరమైన అన్ని అంశాలతో మంచి నిర్మాత నట్టికుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో మంచి హిట్ ఇవ్వడానికి కృషి చేస్తున్నాను అని అన్నారు. నట్టికుమార్ మాట్లాడుతూ - బంగారంలా ఈ సినిమాకి అన్నీ బాగా కుదిరాయి. 12 నుండి షూటింగ్ ప్రారంభిస్తాం. స్విట్జర్లాండ్ లో పాటలు చిత్రీకరిస్తాం. జూలైలో విడుదల చేస్తాం - అని అన్నారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com