Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
పూరి-రాజశేఖర్ ల 'రాజశేఖర్ రెడ్డి'
     వైష్ణో అకాడమీ బ్యానర్‌పై వైఎస్‌.రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా 'రాజశేఖరరెడ్డి' చిత్రాన్ని డాక్టర్ రాజశేఖర్ హీరోగా పూరీ జగన్నాథ్‌ నిర్మించబోతున్నాడు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్‌ మాట్లాడుతూ..'ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో తీస్తాం. ముందు తెలుగులో తీసి ఆ తరువాత మిగిలిన భాషల్లోకి అనువదిస్తాం.

భారతదేశం అంతటికీ తెలిసిన పేరునే చిత్రానికి పెట్టడం జరిగింది. దీనికి ముందు ఈ విషయాన్ని తెలపడానికి వైఎస్‌.జగన్‌ను కలిసాం. చాలా హ్యాపీగా ఫీలయ్యారు. బాగా స్టడీ చేసి తీయమని సలహా ఇచ్చారు. కథానాయకుడి పాత్రను రాజశేఖర్‌ పోషిస్తున్నాడు. పులివెందుల, కడప ప్రాంతాల్లో పరిశోధన చేసి కథను రూపొందించుకుంటాం. రెండున్నర గంటల పాటు ఓ ఆదర్శమూర్తిని గురించ చెప్పడమంటే ఆషామాషీ కాదు. కత్తిమీద సాము. త్వరలో మరిన్ని వివరాలు తెలుపుతాం' అని అన్నారు.

గాంధీ చిత్రం ఎలా అందరి మన్ననలు అందుకుందో ఈ చిత్రం కూడా అలా ఉంటుందని జీవితా రాజశేఖర్‌ అన్నారు. అందరి సహకారంతో హూందాగా తీస్తామని ఆవిడ చెప్పారు. హీరో రాజశేఖర్‌ మాట్లాడుతూ...'ఆయన్ని దృష్టిలో ఉంచుకొని అనుకున్న టైటిల్‌ 'లోకనాయకుడు'. అమితాబ్‌, అభిషేక్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'సర్కార్‌', తమిళంలో 'అయ్యా'...ఈ తరహాలో నేననుకున్న చిత్రం తీద్దామనుకున్నాను.

కానీ ఇంతలో ఎవరూ ఊహించని దుర్ఘటన జరిగిపోయింది. చాలా బాధించింది. ఇది జరిగింది కదా అనిఏదో హడావిడిగానో, ఆషామాషీగానో తీయాలనుకోవట్లేదు. వేలాది మంది దీని గురించి ఫోన్‌లు చేసారు. పూరీ జగన్‌ను కలిసాను. కథ గురించి స్టడీ చేసి మరిన్ని వివరాలు తెలియజేస్తాను' అని అన్నారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com