‘‘అనాధలను అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఓ బౌద్ధ భిక్షువు ఓ గ్రామాన్ని నిర్మిస్తాడు. అదే ఈ
సినిమా నేపథ్యం. వాణిజ్య అంశాలతో పాటు మంచి సందేశాన్ని మిళితం చేసి రెండున్నరేళ్ల పరిశ్రమతో ఈ కథను
తయారు చేశాం. నా హృదయానికి బాగా దగ్గరైన కథ కావడంతో నేనే డెరైక్షన్ చేయడానికి సిద్ధపడ్డాను. రెండు
రోజుల్లో చిత్రీకరణ పూర్తవుతుంది. కోటి సంగీతం ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్’’ అని హరనాథ్ పొలిచర్ల చెప్పారు.
తనే హీరోగా స్వీయ దర్శకత్వంలో పీహెచ్ ప్రొడక్షన్స్ పతాకంపై హరనాథ్ నిర్మిస్తున్న చిత్రం ‘రాజేంద్ర’.
గౌరీపండిట్, జయంతి కథానాయికలు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో నటుడు
జయప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ -‘‘హరనాథ్ పొలిచర్ల మంచి లక్ష్యంతో, సదుద్దేశంతో ఈ చిత్రం నిర్మిస్తున్నారు.
ఆయన కలల్ని ఈ సినిమా నెరవేర్చాలి. ఇందులో నేను ఓ ప్రత్యేకమైన గెటప్‌తో కనిపిస్తాను’’ అని చెప్పారు. ఈ
చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నందుకు జయంతి ఆనందం వెలిబుచ్చారు. కృష్ణుడు, కోట
శ్రీనివాసరావు, ఎమ్మెస్ నారాయణ, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, సుధ తదితరులు నటిస్తున్న
ఈ చిత్రానికి కెమెరా: శరత్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఆర్ట్: రాజీవ్ నాయర్.
|