' డాక్టర్ రాజేంద్రప్రసాద్, సుహాసిని తొలిసారిగా జంటగా నటిస్తున్న చిత్రమిది. ఉషాచరణ్ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత జొన్నాడ రమణమూర్తి ఈ
చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమారంగాలలో దాదాపు 32చిత్రాలకు పైగా దర్శకత్వం, 100కుపైగా చిత్రాలకు
ఛాయాగ్రహణ దర్శకత్వం చేసిన దినేష్ బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్లో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం గురించి దర్శకుడు దినేష్ బాబు మాట్లాడుతూ- ‘వినోదభరిత కుటుంబ కథాచిత్రంగా దీనిని
రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ గా హీరో రాజేంద్రపసాద్, ఆయన భార్యగా, బ్యాంక్ ఉద్యోగినిగా సుహాసినిల కథే చిత్రం.
ప్రేక్షకులను వినోద ప్రపంచంలో విహరింపజేసేలా ఈ చిత్రం వుంటుందని’ అన్నారు.
నిర్మాత జొన్నాడ రమణమూర్తి మాట్లాడుతూ- ‘గంగోత్రి విశ్వనాథ్ సంభాషణలు, ఇ.ఎస్.మూర్తి సంగీత సాహిత్యాలు, దినేష్ బాబు దర్శకత్వ నేర్పు ఈ
చిత్రాన్ని విజయపథాన నడుపుతాయని’ అన్నారు.
ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో ఇంకా- సీనియర్ నరేష్, మరో ప్రధాన పాత్రలో కావేరీఝా, రఘుబాబు, సూర్యతేజ్, హర్షవర్థన్, ఝాన్సీ, రజిత,
శిల్ప, సందీప్తి, ఉషశ్రీ, రమ్యశ్రీ, కళ్యాణి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: గంగోత్రి విశ్వనాథ్, పాటలు:, సంగీతం : ఇ.ఎస్.మూర్తి,
ఎడిటింగ్ : మురళీరామయ్య, కథ-కెమెరా -స్క్రీన్ ప్లే- దక్శకత్వం : దినేష్ బాబు, నిర్మాత : జొన్నాడ రమణమూర్తి.