శ్రీ వెంకటేశ్వర మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'రక్షిత్'. రక్షిత్ కథానాయకుడు. నేహ నాయిక. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో ఉదయం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి రాష్ట్ర మంత్రి సారయ్య క్లాప్‌నిచ్చారు. సురేష్ కొండేటి స్విచ్ఛాన్ చేశారు. సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు వెంకట్ సతీష్ మాట్లాడుతూ "నేనింతకుముందు 'హాలిడేస్' చేశాను. లవ్, యాక్షన్ అని కాదు. ప్రతి పాత్రకూ ప్రాధాన్యత ఉన్న సినిమా ఇది. ఇప్పుడొస్తున్న చిత్రాలకు కాస్త భిన్నంగా ఉంటుంది. విశ్వ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
త్రివేండ్రంలో ఈ నెల 25 నుంచి పాటలను తెరకెక్కిస్తాం. సెప్టెంబర్ ఆఖరున టాకీని చిత్రిస్తాం. మొత్తం మూడు షెడ్యూళ్ళలో సినిమాను పూర్తి చేస్తాం. జనవరి 14న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ''ని అన్నారు. నిర్మాత ప్రసాద్‌రావు మాట్లాడుతూ "దర్శకుడు నాకు 15 ఏళ్ళుగా స్నేహితుడు. బడ్జెట్‌లో సినిమా తీస్తానన్నాడు. నేనే కాస్ట్లీగా తీయమన్నా. హీరోయిన్ తండ్రిగా సుమన్ నటిస్తున్నార''ని చెప్పారు.
సుమన్ మాట్లాడుతూ "నాది లాయర్ పాత్ర. గొప్ప లాయర్‌కు అటు వ్యక్తిగతంగానూ, ఇటు వృత్తిపరంగానూ ఎలాంటి సవాళ్ళు ఎదురవుతాయన్నది ఇందులోని సారాంశం'' అని అన్నారు. మంచి సినిమాలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని నాయికానాయకులు చెప్పారు. 'మంగళ', 'నేను నా రాక్షసి' తర్వాత తాను పనిచేస్తున్న సినిమా ఇదేనని విశ్వ అన్నారు.
బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సత్యప్రకాష్, రఘుబాబు, జీవా, సుమన్‌శెట్టి, సత్యం రాజేష్, హేమ, అపూర్వ, తిరుపతి ప్రకాష్ తదితరులు ఇతర పాత్రధారులు. కథ: శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్, మాటలు: పి.యస్.రామచంద్రుడు, కళ: విజయ్‌కృష్ణ, కూర్పు: గౌతంరాజు, సంగీతం: విశ్వ, కెమెరా: ధనుంజయ్, సమర్పణ: లక్ష్మీ.పి., నిర్మాత: ఆర్.ప్రసాద్‌రావు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ సతీష్.