Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
రామ్, జెనీలియా జంటగా సురేందర్ చిత్రం
      రామ్‌, జెనీలియా జంటగా శ్రీ స్రవంతి మూవీస్‌ నిర్మిస్తున్న తాజా చిత్రం ఆరంభమైంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా చిత్రీకరించిన తొలి దృశ్యానికి నిర్మాతల మండలి అధ్యక్షుడు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కెమెరా స్విచాన్‌ చేయగా, డా.దాసరి నారాయణరావు క్లాప్‌నిచ్చారు. హీరో రవితేజ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం కోన వెంకట్‌ మాట్లాడుతూ -"గత ఆరేడు నెలలుగా ఈ కథ కోసం కృషి చేస్తున్నాం.

ఈ చిత్రదర్శకుడు సురేందర్‌ రెడ్డి తను నమ్మినదాని కోసం ఎంతవరకైనా పోరాడతాడు. ఈ చిత్రంలో హీరో పాత్ర కూడా అలాంటిదే' అన్నారు. "రామ్‌లో ఉన్న ఎనర్జీ నాకు నచ్చుతుంది. అందుకే ఈ సినిమాని 'డబుల్‌ కమిట్‌మెంట్‌'తో చేయాలనుకుంటున్నాను. సినిమా బాగా రావడం కోసం రవికిషోర్‌ ఎక్కడా రాజీపడరు. ఇది నా ఐదో సినిమా. నా గత సినిమాలకన్నా ఈ చిత్రం 'ది బెస్ట్‌'గా ఉంటుంది' అని సురేందర్‌ రెడ్డి చెప్పారు. 'రామ్‌తో ఇది మూడో చిత్రం. మే నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ చేస్తాం' అని స్రవంతి రవికిషోర్‌ అన్నారు. రామ్‌ మాట్లాడుతూ - "సురేందర్‌రెడ్డి మంచి టెక్నీషియన్‌. ఆయన సినిమాలు చాలా స్టయిలిష్‌గా హాలీవుడ్‌ స్థాయిలో ఉంటాయి.

రసూల్‌గారు అద్భుతమైన కెమెరామన్‌. దేవదాసు, మస్కా తర్వాత మళ్లీ చక్రి కాంబినేషన్లో చేస్తున్నాను. మా పెదనాన్నలాంటి నిర్మాత సపోర్ట్‌ నాకుండటం ఆనందంగా ఉంది' అన్నారు. "స్రవంతి బేనర్‌లో చేయాలనే నా కోరిక ఈ చిత్రంతో తీరుతోంది. రామ్‌ ఎనర్జిటిక్‌ హీరో. తనకి పాటలు చేయడం అంటే ఓ ఛాలెంజ్‌లాంటిదే' అని చక్రి చెప్పారు. ఇంకా వక్కంతం వంశీ, రసూల్‌ ఎల్లోర్‌, సమర్పకుడు కృష్ణచైతన్య కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: కోన వెంకట్‌, సంగీతం: చక్రి, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, కెమెరా: రసూల్‌ ఎల్లోర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: నారాయణ రెడ్డి, సమర్పణ: కృష్ణచైతన్య, నిర్మాత: స్రవంతి రవికిషోర్‌, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సురేందర్‌ రెడ్డి.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com