భావన సమర్పణ లో సి.వి.ఎల్ నరసింహారావు 'రతనాల వీణ' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలంగాణా
ప్రజల బతుకు చిత్రంగా నిర్మిస్తున్న 'రతనాల వీణ' ఇప్పటికి 80 శాతం పూర్తయ్యింది. హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్
జరుపుకున్న ఈ చిత్రం కోసం విష్ణు కిషోర్ సంగీత సారధ్యంలో 6 పాటలు రికార్డ్ చేసారు. నిస్సార్ రచన, గానంతో 5 పాటలు,
నరసింహ రచన, గానంతో ఒక పాట ఇందులో ఉన్నాయి . ఈ పాటల ను 'సరిగమ' ఆడియో ద్వారా ఆర్.కే.ఛానల్ లో ఈ నెల
10 న విడుదల చేసారు. ఇందులో కొండా లక్ష్మణ్ బాపూజీ, నందిని సిద్దారెడ్డి, జూలూరి గౌరీ శంకర్, హన్మంతరావు, జస్వంత్
రెడ్డి, రమేష్ హజారి, మురళీధర్ దేశపాండే, బుగ్గయ్య, నిసార్, పసునూరి రవీందర్, విష్ణు కిషోర్, నరసింహ, రవి ప్రసాద్ గౌడ్,
ముప్పిడి గోపాల్, నల్ల సురేష్ రెడ్డి నటించారు. ఫొటోగ్రఫీ: జయకృష్ణ, ఎడిటింగ్: మధు, నిర్మాతలు: రాష్ట్ర ప్రజలు.
రచన, దర్శకత్వం: సి.వి.ఎల్.
|