Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
రవితేజ ‘మిరపకాయ్’
      ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రవితేజ, దీక్ష, రిచ ప్రధాన తారాగణంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ‘మిరపకాయ్’ షూటింగ్ ప్రారంభమైంది. వెంకటేష్ క్లాప్ ఇవ్వగా ప్రభాస్ కెమేరా స్విచాన్ చేశారు. వినాయక్ తొలిషాట్ కు దర్శకత్వం వహించారు.

రవితేజ మాట్లాడుతూ - మంచి నిర్మాత పుప్పాల రమేష్ తో ఈ చిత్రం చేయడం ఆనందంగా ఉంది. ‘షాక్’ తర్వాత హరీష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రిచ, దీక్ష ఇందులో హీరోయిన్లు. తమన్ సంగీతం, బెస్ట్ కెమేరామెన్ రాజశేఖర్ ఫోటోగ్రఫీతో ఈ చిత్రం బాగా వస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు. హరీష్ మాట్లాడుతూ - ‘షాక్’ నాకు గొప్ప అనుభవం ఇచ్చింది. చాలా మంది కొత్త దర్శకులను పరిచయం చేసిన రవితేజ, నన్ను ఈ చిత్రంతో తిరిగి పరిచయం చేస్తున్నారు. సక్సెస్ తోనే మాట్లాడే ఈ పరిశ్రమలో సక్సెస్ లేకపోయినా నన్ను ప్రోత్సహిస్తున్న రవితేజకు కృతజతలు. ప్రేక్షకులు రవితేజ నుండి ఆశించిన దానికన్నా ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అని అన్నారు.

నిర్మాత రమేష్ మాట్లాడుతూ - మే చివరివారం నుండి ఇజ్రాయిల్, దుబాయ్, ప్యారిస్ లో ఈ చిత్రం షూటింగ్ చేస్తాం. దీపావళికి ఈ మిరపకాయ్ ఘాటు ప్రేక్షకులు రుచి చూస్తారు - అని అన్నారు. చాలా రోజుల తర్వాత ఈ చిత్రంలో మరో మంచి పాత్ర పోషిస్తున్నానని రాజా రవీంద్ర చెప్పారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com