డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ వంటి సూపర్‌హిట్స్ ఇచ్చిన యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా మాస్, డాన్, కాంచన వంటి హిట్ చిత్రాల
దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకత్వంలో శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావులు
నిర్మిస్తున్న భారీ చిత్రం ‘రెబల్’ చివరి షెడ్యూల్ నవంబర్ 5 నుంచి ఏకధాటిగా జరుగుతుంది. ఈ చిత్రం ప్రోగ్రెస్ గురించి
నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావులు మాట్లాడుతూ ‘ఇప్పటివారకూ 50 రోజులపాటు జరిగిన షూటింగ్‌లో కొన్ని
ముఖ్యసన్నివేశాలు, రెరండు మేజర్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఒక పాట చిత్రీకరించడం జరిగింది. ప్రస్తుతం మిగిలిన పాటల రికార్డింగ్
జరుగుతోంది.
నవంబర్ 5 నుండి నిరవధికంగా చిత్రం పూర్తయ్యేవరకూ షెడ్యూల్ ప్లాన్ చేశాం. ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్‌లు
హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే దర్శకుడు లారెన్స్ ఏ విషయంలోనూ రాజీపడకుండా తప్పనిసరిగా సూపర్‌హిట్
తీయాలనే పట్టుదలతో ఈ చిత్రం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ఇంత భారీ చిత్రాన్ని నిర్మాతలుగా అందిం చడం ఎంతో
థ్రిల్‌గా వుంది. ప్రభాస్ కెరీర్‌లోనే ఇది హైబడ్జెట్ సినిమా అవుతుంది.
టైటిల్‌కి తగినట్లుగా చాలా పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో రెబల్ చిత్రం రూపొందుతోంది. తప్పకుండా ఇది సూపర్‌హిట్ అవుతుంది’
అన్నారు. దర్శకుడు రాఘవ లారెన్స్ మాట్లాడుతూ ‘ప్రభాస్ పర్సనాలిటీకి, ప్రభాస్ ఇమేజ్‌కి పర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యే సబ్జెక్ట్ ఇది.
ప్రభాస్ తప్ప ఇది ఎవరూ చేయలేరు. ‘రెబల్’ చాలా మంచి సినిమా అవుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు:
జె.భగవాన్, జె.పుల్లారావు, కథ-స్క్రీన్‌ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్.
|