ఫిలిం న్యూస్
 
 
 
 
తెలుగులో 'రేణిగుంట'
గత ఏడాది తమిళనాడులో విడుదలై విజయం సాధించిన ఓ చిత్రాన్ని సంతోషం స్టూడియోస్ ప్రై.లి. సమర్పణలో ఎస్. కె. పిక్చర్స్ పతాకంపై 'రేణిగుంట' పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు సురేష్ కొండేటి. పన్నీర్ సెల్వం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జానీ, సనూష, నిశాంత్ ముఖ్య తారాగణం.

ఈ చిత్రం వివరాలను సురేష్ వెల్లడిస్తూ ' తల్లితండ్రులతో ఆనందంగా జీవించే ఓ యువకుని జీవితంలో అనుకోని ఓ సంఘటన చోటు చేసుకుంటుంది. ఆ సంఘటన అతని జీవితాన్ని మార్చివేస్తుంది. ఆ యువకుని తల్లితండ్రులు హత్యకు గురవుతారు. ఆ షాక్ నుంచి తేరుకొనే లోపల హత్యానేరంపై జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ నలుగురు క్రిమినల్స్ అతనికి పరిచయమవుతారు. వారి సాయంతో తన తల్లితండ్రులను చంపిన వారిపై ఆ యువకుడు ఎలా పగ తీర్చుకున్నాడన్నది తరవాతి కథాంశం. లవ్, యాక్షన్ సన్నివేశాలతో ఆసక్తికరంగా ఈ సినిమా సాగుతుంది. త్వరలో ఈ సినిమాను విడుదల చేస్తాం' అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: గణేష్ రాఘవేంద్ర, ఫొటోగ్రఫీ: శక్తి, ఎడిటింగ్: ఆంథోని, సహనిర్మాత: బత్తుల సత్యనారాయణ, నిర్మాత: సురేష్ కొండేటి, దర్శకత్వం: పన్నీర్ సెల్వం.