సందీప్, రెజీన జంటగా ఎ వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్, బెంచ్‌మార్క్ మూవీస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'రొటీన్ లవ్ స్టోరీ'. ఈ చిత్రానికి దర్శకత్వం ప్రవీణ్ సత్తారు. నిర్మాతలు చాణక్య బోనేటి, పి.మణికుమార్. మిక్కీ జె.మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది.
మహూర్తం సన్నివేశానికి నిర్మాత బెల్లంకొండ సురేష్ క్లాప్ కొట్టగా, దిల్ రాజు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందించగా, గౌరవ దర్శకత్వం కె.అచ్చిరెడ్డి వహించారు. లక్ష్మీ మంచు, నందినిరెడ్డి సంయుక్తంగా స్క్రిప్టుని అందజేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు ప్రవీణ్ మాట్లాడుతూ "హిట్టయిన నా తొలిచిత్రం 'ఎల్‌బిడబ్ల్యూ' స్ఫూర్తితో 'రొటీన్ లవ్ స్టోరీ' చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చాం. ఇది రొమాంటిక్ కామెడీ చిత్రం. ఇందులో 80శాతం కామెడీ ఉంటుంది. ఈనెల 24 నుంచి మొదటి షెడ్యూల్‌ని ప్రారంభిస్తాం. 20 రోజుల పాటు షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది.
తరువాత డిసెంబరు మొదటి వారంలో రెండో షెడ్యూల్‌ని లడక్, శ్రీలంక తదితర చోట్ల 15 రోజుల పాటు నిర్వహిస్తాం. జనవరి ఆఖరుకి మొదటి కాపీని సిద్ధం చేసి, ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
హీరో సందీప్ మాట్లాడుతూ "ప్రవీణ్ చెప్పిన 'రొటీన్ లవ్ స్టోరీ' స్క్రిప్టు బాగా నచ్చింది. ఇందులో 19 ఏళ్ళ కుర్రాడిగా నటిస్తున్నా. ఓ లాజిక్‌తో బతికేస్తు ఉంటాడు. అదే లాజిక్‌ని లవ్‌కి అప్లై చేసి, ప్రేమను ఎలా గెలుచుకున్నాడనేది ఇందులో స్టోరీ'' అన్నారు. నిర్మాత చాణక్య బోనేటి మాట్లాడుతూ "రొటీన్ లవ్ స్టోరీని రొటీన్‌గా కాకుండా వెరైటీగా చూపిస్తారని ఆశిస్తున్నా'' అన్నారు.
ఎమ్.ఎస్.నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, హేమ, సురేఖావాణి, ఝూన్సీ, మాస్టర్ భరత్, తాగుబోతు రమేష్, ప్రగతి, కృష్ణుడు (గెస్ట్ అప్పీయరెన్స్), ఆర్.జె.హేమంత్, ఆర్.జె.భరత్, స్నిగ్ధ, స్వప్నిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటో గ్రఫీ: సురేష్/చోటా కె.నాయుడు, ఎడిటర్: ధర్మేంద్ర, లిరిక్స్: కృష్ణ చిన్న మాదినేని, ఆర్ట్ డైరెక్టర్: ఉపేంద్ర, కాస్ట్యూమ్ డిజైనర్: శాంతి, కథ, స్క్రీన్‌ప్లే దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.