ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించిన ప్రముఖ దర్శకుడు పి.చంద్రశేఖర రెడ్డి దర్శకత్వంలో ఇండియన్ ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంఫై రొమాంటిక్,
హార్రర్ చిత్రం 'సైతాన్' రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం అయ్యింది. హీరో, హీరోయిన్ సంతోష్, ఆకర్షలఫై తొలి సన్నివేశాలను చిత్రీకరించారు. దర్శకుడు పి చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ- గతంలో మంచి ఫ్యామిలీ
చిత్రాలు అందించిన నేను ఇప్పటి యువ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఉత్సాహం, ఉత్కంట, ఆకర్షణ కలిసిన ఈ చిత్రాన్ని చేస్తున్నాను. 'నిన్ను కలిసాక'
లో చేసిన సంతోష్ ఇందులో హీరోగా, నలుగురు అందమైన బొంబాయి అమ్మాయిలూ ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రెండుసార్లు నంది అవార్డ్ లు
అందుకున్న సుధాకర్ రెడ్డి ఫోటోగ్రఫీతో పాటు, పలువురు ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రాన్ని మంచిస్థాయిలో రూపొందించడానికి కృషి
చేస్తున్నారని అన్నారు . నిర్మాత ఆర్.వేంకటేశ్వరరావు మాట్లాడుతూ- అనుభవజ్ఞుడు అయిన చంద్రశేఖర రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మిస్తున్నందుకు
చాలా ఆనందం గా ఉంది. గతంలో వచ్చిన హార్రర్ చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. ఆసక్తిని రేకెత్తించేలా దీన్ని రూపొందిస్తున్నాము. చిత్రం
పూర్తయ్యేవరకు సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేస్తామని అన్నారు. హీరో సంతోష్ మాట్లాడుతూ- ప్రేమ, భయం అనే అంశాలు యువ ప్రేక్షకులను ఎక్కువగా
ఆకట్టుకుంటాయి. ప్రేమ, భయం సమపాళ్ళలో కలిపి డిఫరెంట్ గా ఈ చిత్రాన్ని చేస్తున్నారని అన్నారు.
సంతోష్ సామ్రాట్, ఆకర్ష, సుత్తివేలు, శ్రుతి, ద్వారకేష్, శశాంక్, బొంబాయి రవి, డాక్టర్ ప్రభు, శ్రావణి నటిస్తున్న ఈ చిత్రం లో అమిత్ కుమార్ విలన్ గా చేస్తున్నారు. మాటలు: వట్రపు సత్యా రెడ్డి, ఫోటోగ్రఫి: సుధాకర్ రెడ్డి, సంగీతం: శశి ప్రీతం, ఎడిటింగ్: కె.రవీంద్రబాబు, ప్రొడక్షన్ ఎగ్జిక్యుటివే: ఉల్లగంటి ప్రసాద్, నిర్మాత ఆర్.వేంకటేశ్వరరావు, కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.చంద్రశేఖర రెడ్డి.