Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
‘సలీమ్’ లోగో ఆవిష్కరణ
      శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై విష్ణు, ఇలియానా జంటగా వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మిస్తున్న 50వ చిత్రం ‘సలీమ్’ లోగో ఆవిష్కరణ జరిగింది. ‘బిగ్ పిక్చర్’ సమర్పిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.

వై.వి.ఎస్.చౌదరి మాట్లాడుతూ- ‘అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం అనుకున్నదానికన్నా ఆలస్యమయ్యింది. ‘సలీమ్’ ఒక ప్రేమకథ. ఆధునిక వాతావరణంలో హృదయానికి హత్తుకునేలా వుంటుంది. ఎక్కడా రాజీలేకుండా భారీస్థాయిలో చేశాం. నవంబర్ 11న ఆడియో విడుదలవుతుందని’ అన్నారు.

మోహన్ బాబు మాట్లాడుతూ- ‘రిలయన్స్ బిగ్ పిక్చర్స్ తో కలిసి ఈ చిత్రం చేస్తున్నాం. చౌదరి చాలా గొప్ప టెక్నీషియన్. చాలా బాగా చేశారు. డిసెంబర్ రెండవ వారంలో విడుదల చేయాలనుకుంటున్నాం’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో హీరో విష్ణువర్థన్ బాబు, వెంకట్, గోపీమోహన్, విజయ్, చంద్రబోస్, రాంప్రసాద్, చింతపల్లి రమణ, బిగ్ పిక్చర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com