సలోని కథానాయికగా దర్శకుడు రాజా వన్నెంరెడ్డి రూపొందిస్తోన్న చిత్రం 'తెలుగమ్మాయి'.
చేగొండి హరిరామజోగయ్య, కరాటం రాంబాబు సంయుక్త సారథ్యంలో వైష్ణవి మూవీస్ పతాకంపై
వానపల్లి బాబూరావు నిర్మిస్తున్నారు. జనవరి 21 నుంచి ఈ నెల 3 వరకు పాలకొల్లు పరిసర
ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం గురించి రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ "నలుగురు
కుర్రాళ్లు, ఓ అమ్మాయి సికిందరాబాద్ నుంచి గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో సామర్లకోట వరకు
వెళతారు.
ఆ సందర్భంలో ట్రైన్‌లో ఎలాంటి సంఘటనలు జరిగాయనేది వినూత్నంగా ఉంటుంది.
తెలుగమ్మాయి ఎలా ఉండాలో తెలియజెప్పే సినిమా ఇది. టైటిల్ పాత్రను పోషిస్తున్న సలోని
అందరి మనసుల్లో ఉండిపోతుంది'' అని చెప్పారు.
నిర్మాత బాబూరావు మాట్లాడుతూ "ఈ నెల 14 నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో చివరి
షెడ్యూలు జరుపుతాం. చిత్ర పరిశ్రమలోనే చిరస్థాయిగా గుర్తుండిపోయే మంచి చిత్రంగా
'తెలుగమ్మాయి' నిలుస్తుంది'' అన్నారు. 'మర్యాద రామన్న' తర్వాత మళ్లీ ఓ మంచి సినిమాతో
తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉందని నాయిక సలోని
తెలిపారు.
హరిరామజోగయ్య మాట్లాడుతూ "ఈ నెలాఖరుకి షూటింగ్ పూర్తవుతుంది. మార్చిలో
పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిపి, ఉగాది పండుగకు చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు
చేస్తున్నాం'' అన్నారు.
యశ్వంత్, విక్రమ్, శ్రీహర్ష, సాయిచంద్ హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రంలో కల్యాణి, బేబి
గీతిక, షఫీ, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, జీవా, కొండవలస, సాయాజీ షిండే, ఆర్.కె.
నాయుడు, చంటి, ఝాన్సీ, గీతాసింగ్ తారాగణం. ఈ చిత్రానికి పాటలు: అనంత శ్రీరామ్,
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, ఛాయాగ్రహణం: వాసు, కూర్పు: గౌతంరాజు, కళ: రమేశ్,.