‘‘టైటిల్‌కి తగ్గట్టుగానే సినిమా సంచలన విజయం సాధించింది. స్క్రీన్‌ప్లే, ఫ్యాష్‌బ్యాక్ ఎపిసోడ్, సస్పెన్స్, రీ
రికార్డింగ్, ఫొటోగ్రఫీ... ఇలా అన్నీ బాగా ఉన్నాయని అభినందిస్తున్నారు. ముఖ్యంగా అచ్చిరెడ్డిగారు సినిమా
చాలా బాగుందని ప్రశంసించారు. నా డైలాగులు బాగా పేలాయి. రొటీన్‌ని బ్రేక్ చేసిన సినిమా ఇది’’ అని
సాయికుమార్ చెప్పారు. కమలాకర్, సాయికుమార్ కాంబినేషన్‌లో బీవీ రమణారెడ్డి దర్శకత్వంలో బూచేపల్లి
వెంకాయమ్మ సమర్పణలో కమల్ పిక్చర్స్ పతాకంపై కమలాకర్‌రెడ్డి నిర్మించిన ‘సంచలనం’ ఇటీవల
విడుదలైంది.
ఈ చిత్రం ప్రెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. కమలాకర్ మాట్లాడుతూ-‘‘ ‘పోలీస్‌స్టోరీ’ తరహాలో
సాయికుమార్ ఇందులో పవర్‌ఫుల్ రోల్ చేశారు. రీమిక్స్ సాంగ్ ‘వంగతోట మలుపు కాడ...’కు మంచి రెస్పాన్స్
వచ్చింది. చిన్నా రీ-రికార్డింగ్ అద్భుతం. ఇందులో నాది సాధారణ యువకుని పాత్ర. సినిమాను ఇంత మంచి
హిట్ చేసిన ప్రేక్షకులకు మా ధన్యవాదాలు’’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ప్రేక్షకులు వైవిధ్యానికి
ఎప్పుడూ పెద్ద పీట వేస్తారనడానికి ఈ సినిమా ఒక నిదర్శనం. మాస్, యూత్ ఈ సినిమాని బాగా ఎంజాయ్
చేస్తున్నారు. ఈ సినిమాతో మంచి జాబ్ శాటిస్‌ఫాక్షన్ లభించింది’’ అని అన్నారు. ఈ విజయం పట్ల సంగీత
దర్శకుడు చిన్నా, ఫైట్ మాస్టర్ నందు తమ సంతోషం వెలిబుచ్చారు.
|