నాని, నిత్యామీనన్, బిందుమాధవి కాంబినేషన్ లో మనదేశం మూవీస్ పతాకంపై అశోక్ వల్లభనేని నిర్మించిన చిత్రం ‘సెగ’. ఈనెల 29న
చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
‘‘యువతరం మనసు ఓ సముద్రం. వారి ప్రతి ఆలోచనా ఓ కెరటం. అన్ని కెరటాలూ ఒక్కలా ఉండవు. అలాగే ఆలోచనలు కూడా. ఓణికావేశం
కుర్రకారుని కుదురుగా ఉండనివ్వదు. ఆ సమయంలోనే ఆవేశపూరిత నిర్ణయాలకు పాల్పడుతుంటారు. అలాంటి నిర్ణయాలే మున్ముందు
జీవితంలో పెనుమార్పులకు కారణభూతమవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ‘సెగ’ సినిమా ఉంటుంది. క్లాస్, మాస్ గా వర్గీకరించ లేనంత
అధ్భుతమైన కథాంశమిది’’ అని దర్శకురాలు అంజన చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ - ‘‘నాని ఇప్పటివరకూ చేసిన సినిమాలకు ‘సెగ’ పూర్తి భిన్నంగా ఉంటుంది. ‘అలా మొదలైంది’తో మంచి జంటగా పేరు
తెచ్చుకున్న నాని, నిత్యామీనన్ ‘సెగ’తో సూపర్ హిట్ పెయిర్ అనిపించుకుంటారు. నానిలోని మాస్ యాంగింల్ ను అత్యద్భుతంగా ప్రెజెంట్
చేశాం. జోష్యా శ్రీధర్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. ఈ సినిమాలో
యాక్షన్ ఎపిసోడ్స్ కు మంచి ప్రాధాన్యముంది. మా దర్శకురాలు అంజన బ్లాక్ బెల్ట్ హోల్డర్ కావడంతో ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు’’ అని
తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ : మాస్టర్ అచ్యుత్, కెమెరా : ఓం ప్రకాష్, ఎడిటింగ్ : ఆంటోనీ.