శ్రీమహాగణపతి ఫిలింస్ పతాకంపై సముద్ర దర్శకత్వంలో ఎం.సుధాకర్ నిర్మిస్తున్న 'సేవకుడు' షూటింగ్ ప్రారంభం అయ్యింది. శ్రీకాంత్‌పై చిత్రీకరించిన తొలిషాట్‌కు కుమారచౌదరి క్లాప్ ఇవ్వగా, డా||వెంకటేశ్వరరావు కెమేరా స్విచాన్ చేశారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ - ఈ సంస్థలో 'తారక రాముడు', 'మనసిస్తారా' చిత్రాల తర్వాత ఈ చిత్రం చేస్తున్నాను. సుధాకర్ మంచి మిత్రుడు. మాస్ డైరెక్టర్ ఇమేజ్ ఉన్న సముద్రతో ఈ చిత్రం చేస్తున్నాను. ఎమోషన్, సెంటిమెంట్‌తో ఈ చిత్రం ఉంటుంది - అని అన్నారు. నిర్మాత సుధాకర్ మాట్లాడుతూ - శ్రీకాంత్, సముద్ర సహకారంతో మంచి చిత్రం తీయాలనే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
సముద్ర మాట్లాడుతూ - శివరామరాజు, మహానందిలా పవర్‌ఫుల్ సబ్జక్ట్‌తో ఈ చిత్రం చేస్తున్నాను. సూపర్ డూపర్ హిట్ అవుతుంది. జడ్జిమెంట్‌తో పనికాదు, పనిష్మెంట్ కావాలని చెప్పే కథాంశంతో, నాకు బాగా ఇష్టమైన టైటిల్‌తో ఈ చిత్రం చేస్తున్నాం. హీరో పాత్ర సమాజానికి 'సేవకుడు'గా ఉంటుంది. మార్చి 25 నుండి జూలై వరకూ చిత్రం పూర్తి చేసి, ఆగస్టు 15న విడుదల చేయాలనుకుంటున్నాం అని అన్నారు. ఈ చిత్రానికి మాటలు: స్వామీజీ, విజయ్, సంగీతం : శ్రీకాంత్ దేవా.