Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
‘శక్తి’ ప్రోగ్రెస్
     యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ‘కంత్రి’ ఫేమ్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ సి.అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘శక్తి’. ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ- ‘ఈజిప్ట్ లో జరిగిన షెడ్యూల్లో విలన్స్ కు సంబంధించిన కొన్న కీలకమైన సన్నివేశాల్ని జాకీష్రాఫ్, పూజాబేడి, సోనూసూద్ లతోపాటు 25మంది ఫారిన్ ఆర్టిస్టులతో చిత్రీకరించడం జరిగింది. జూలై 11నుండి సినిమాలోని ప్రధాన తారాగణం పాల్గొనే కొన్ని సన్నివేశాల్ని లడక్, జమ్ము, కాశ్మీర్, రుషికేష్, హరిద్వార్ లలో అత్యంత కీలక సన్నివేశాల్ని చిత్రీకరించనున్నాం. తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక లొకేషన్స్ లో, అత్యధిక బడ్జెట్ తో, హై టెక్నికల్ వేల్యూస్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే ఓ లాండ్ మార్క్ ఫిల్మ్ అవుతుంది. మా వైజయంతీ బ్యానర్ కి ‘శక్తి’ ఓ ప్రెస్టీజియస్ చిత్రం అవుతుంది. మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని చాలా బాగా తీస్తున్నారు. తప్పకుండా ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం నాకుంది’ అన్నారు.

ఎన్టీఆర్, ఇలియానా, జాకీష్రాఫ్, పూజాబేడి, సోనూసూద్, నాజర్, అలీ, కృష్ణభగవాన్ లతోపాటు ఈ చిత్రంలో చాలామంది ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు : సత్యానంద్, ఫొటోగ్రఫి: సమీర్ రెడ్డి, సంగీతం : మణిశర్మ, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్ : మార్తాండ్ కె.వెంకటేష్, రచనా సహకారం యండమూరి వీరేంద్రనాథ్, జె.కె.భారవి, తోట ప్రసాద్, డి.ఎస్.కన్నన్, పాటలు: వేటూరి, సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, సమర్పణ : సి.ధర్మరాజు, నిర్మాత : సి.అశ్వనీదత్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : మెహర్ రమేష్.

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com