ఫిలిం న్యూస్
 
 
 
 
శివ - రవితేజల చిత్రం

రవితేజ హీరోగా శ్రీమతి నాగమునీశ్వరి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్ మెంట్ లిమిటెడ్ పతాకంపై ‘శౌర్యం’ శివ దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.14గా ప్రముఖ నిర్మాత బూరుగపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ ఆగస్ట్ 18న హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది.

రవితేజ మాట్లాడుతూ - శివ సెన్సిబుల్ డైరెక్టర్. అతనికి మాస్ పల్స్ బాగా తెలుగు. అతను చెప్పిన కథ ఎంతో ఇన్ స్పైరింగ్ గా వుంది. బూరుగపల్లి శివరామకృష్ణగారి బేనర్ లో ఓ మంచి ఎంటర్ టైనర్ ను చేస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది అన్నారు.

దర్శకుడు శివ మాట్లాడుతూ - రవితేజ ఇప్పటివరకు చెయ్యని క్యారెక్టర్ ఇది. ఎంటర్ టైన్ మెంట్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ చేస్తున్న ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయి. మంచి మాస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందనుంది. రవితేజ, బూరుగపల్లి శివరామకృష్ణలతో కలిసి వర్క్ చేయడం ఆనందంగా వుంది అన్నారు.

నిర్మాత బూరుగపల్లి శివరామకృష్ణ మాట్లాడుతూ - మంచి ఎనర్జీ వున్న రవితేజ అంటే నాకు చాలా ఇష్టం. రవితేజ మా బేనర్ లో ఫస్ట్ టైమ్ నటిస్తున్నాడు. దర్శకుడు శివ మా సొంత డైరెక్టర్ లా మాలో కలిసిపోయాడు. రవితేజ, శివ కాంబినేషన్ లో రూపొందుతున్న మంచి సినిమా ఇది అన్నారు.

రవితేజ, డా. రాజేంద్రప్రసాద్, డా. బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రఘుబాబు, షాయాజీ షిండే, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ : శివ, ఆదినారాయణ, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్ : గౌతంరాజు, సంగీతం : విజయ్ ఆంథోని, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : వెట్రి, సమర్పణ : శ్రీమతి నాగమునీశ్వరి, నిర్మాత : బూరుగపల్లి శివరామకృష్ణ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : శివ.